ఎవ్వరికిఁ గలవమ్మ ఇటువంటి సొబగులు
(॥పల్లవి॥)
ఎవ్వరికిఁ గలవమ్మ ఇటువంటి సొబగులు
నివ్వటిల్ల నన్నియును నీకే తగుఁగాక
(॥ఎవ్వ॥)
జక్కవగుబ్బల మీఁద జారేటి పయ్యదకొంగు
చెక్కులపై వడిసేటి చెమటనీరు
పుక్కిటి బంటియైన పొలపనిట్టురుపులు
ఇక్కువలై కనుపట్టె నేనోము నోఁచితివో
(॥ఎవ్వ॥)
కడలేని బిత్తరపు కనుచూపుతేటలు
గుడిగొన రాలేటి కొప్పవిరులు
జడియక తొలఁకేటి చక్కని మోముకళలు
అడరి నీవు సేసిన దది యెంత భాగ్యమో
(॥ఎవ్వ॥)
మొగి సెలవులఁ గమ్మేముసి ముసినగవులు
చిగురుఁబెదవి నూరే చిరుసిగ్గులు
జిగి నలమేల్మంగవు శ్రీవేంకటేశురాణివి
తగిలె నీకీరతులు తపమెంత సేసితివో
(||pallavi||)
ĕvvarigim̐ galavamma iḍuvaṁṭi sŏbagulu
nivvaḍilla nanniyunu nīge tagum̐gāga
(||ĕvva||)
jakkavagubbala mīm̐da jāreḍi payyadagŏṁgu
sĕkkulabai vaḍiseḍi sĕmaḍanīru
pukkiḍi baṁṭiyaina pŏlabaniṭṭurubulu
ikkuvalai kanubaṭṭĕ nenomu nom̐sidivo
(||ĕvva||)
kaḍaleni bittarabu kanusūbudeḍalu
guḍigŏna rāleḍi kŏppavirulu
jaḍiyaga tŏlam̐keḍi sakkani momugaḽalu
aḍari nīvu sesina dadi yĕṁta bhāgyamo
(||ĕvva||)
mŏgi sĕlavulam̐ gammemusi musinagavulu
sigurum̐bĕdavi nūre sirusiggulu
jigi nalamelmaṁgavu śhrīveṁkaḍeśhurāṇivi
tagilĕ nīgīradulu tabamĕṁta sesidivo