ఎవ్వరికిఁ దెలుసును ఇటువంటి మీగుట్లు
(॥పల్లవి॥)
ఎవ్వరికిఁ దెలుసును ఇటువంటి మీగుట్లు
యివ్వల వెల్లవిరైన దిపు డింతేకాక
(॥ఎవ్వ॥)
యెఱుఁగుదుమా తొల్లి యాపె నీకు దేవులౌత
చిఱుతనవ్వుల నీపైఁ జిందఁగాఁగాక
గుఱుతు గానవచ్చునా కోరినమీపొందులకు
వుఱక నీవద్ద బాయకుండఁగాఁగాక
(॥ఎవ్వ॥)
చెప్పితిరా మీరు మాకు సేసుకొన్నపెండ్లి
కప్పి యాపె నవ్వఁగానే కంటిమిగాక
వొప్పి చూచుకున్నారమా వుడివొనిమీరతులు
చిప్పిలఁ దా నిందరితోఁ జెప్పుకోఁగాఁగాక
(॥ఎవ్వ॥)
పుట్టెనా యెక్కడనైనా పొంచి మీచుట్టరికాలు
బట్టబయ లాపె సిగ్గువడఁగాఁగాక
గట్టిగ నలమేలుమంగకాఁగిటి శ్రీవేంకటేశ
ఇట్టె నన్నేలితి వీకె నిరవాయఁగాక
(||pallavi||)
ĕvvarigim̐ dĕlusunu iḍuvaṁṭi mīguṭlu
yivvala vĕllaviraina dibu ḍiṁtegāga
(||ĕvva||)
yĕṟum̐gudumā tŏlli yābĕ nīgu devulauda
siṟudanavvula nībaim̐ jiṁdam̐gām̐gāga
guṟudu gānavachchunā korinamībŏṁdulagu
vuṟaga nīvadda bāyaguṁḍam̐gām̐gāga
(||ĕvva||)
sĕppidirā mīru māgu sesugŏnnabĕṁḍli
kappi yābĕ navvam̐gāne kaṁṭimigāga
vŏppi sūsugunnāramā vuḍivŏnimīradulu
sippilam̐ dā niṁdaridom̐ jĕppugom̐gām̐gāga
(||ĕvva||)
puṭṭĕnā yĕkkaḍanainā pŏṁchi mīsuṭṭarigālu
baṭṭabaya lābĕ sigguvaḍam̐gām̐gāga
gaṭṭiga nalamelumaṁgagām̐giḍi śhrīveṁkaḍeśha
iṭṭĕ nannelidi vīgĕ niravāyam̐gāga