ఎవ్వరికి మోహించినా యే నిన్ను వద్దనేనా
(॥పల్లవి॥)
ఎవ్వరికి మోహించినా యే నిన్ను వద్దనేనా
ఇవ్వల నన్నుఁజూచి యేల సిగ్గువడేవు
(॥ఎవ్వ॥)
అకెసుద్దులే వింటా నందలముమీఁద నుండి
జోకగా ఆయింటిదిక్కే చూచుకొంటాను
మేకొని పైఁజెమటలు మేన నిండా వడియఁగా
యీకడ నామోము చూచి యేల సిగ్గువడేవు
(॥ఎవ్వ॥)
గుఱుతైనచెలి నాపెగుణము లడుగుకొంటా
చిఱునవ్వులు సెలవిఁ జిందుకొంటాను
నెఱి నావీది నాడాడ నిలిచి యాసించుకొంటా-
నెఱిగితే నన్నుఁజూచి యేల సిగ్గువడేవు
(॥ఎవ్వ॥)
యిక్కువలు చెప్పుకొంటా నెదురులు చూచుకొంటా
నిక్కి మాఇంటికి వచ్చి నీవు నన్నేలి
అక్కున శ్రీవేంకటేశ అలమేల్‌మంగ నుంచఁగా
యిక్కడ నేఁ జూచి తే యేల సిగ్గువడేవు
(||pallavi||)
ĕvvarigi mohiṁchinā ye ninnu vaddanenā
ivvala nannum̐jūsi yela sigguvaḍevu
(||ĕvva||)
agĕsuddule viṁṭā naṁdalamumīm̐da nuṁḍi
jogagā āyiṁṭidikke sūsugŏṁṭānu
megŏni paim̐jĕmaḍalu mena niṁḍā vaḍiyam̐gā
yīgaḍa nāmomu sūsi yela sigguvaḍevu
(||ĕvva||)
guṟudainasĕli nābĕguṇamu laḍugugŏṁṭā
siṟunavvulu sĕlavim̐ jiṁdugŏṁṭānu
nĕṟi nāvīdi nāḍāḍa nilisi yāsiṁchugŏṁṭā-
nĕṟigide nannum̐jūsi yela sigguvaḍevu
(||ĕvva||)
yikkuvalu sĕppugŏṁṭā nĕdurulu sūsugŏṁṭā
nikki māiṁṭigi vachchi nīvu nanneli
akkuna śhrīveṁkaḍeśha alamelmaṁga nuṁcham̐gā
yikkaḍa nem̐ jūsi te yela sigguvaḍevu