(॥పల్లవి॥)
ఎవ్వరిభాగ్యం బెట్టుండునో
జవ్వనభారము చలివేఁడాయ
(॥ఎవ్వ॥)
తిరుగ నాపె నినుఁ దిట్టులు దిట్టఁగ
సరవుల నీకవి చవులాయ
గిరికొన నీకు మొక్కిన మా మొక్కులు
వెరవున నీకవి వెంగెము లాయ
(॥ఎవ్వ॥)
తగులఁగఁ జెలి నిను తమ్మను వేయఁగ
నగవున నీకది నయమాయ
వొగి నే నప్పుడు వొసఁగిన కానుక
పగటున నీ కవి పంగెములాయ
(॥ఎవ్వ॥)
పడతి నీమీదను పాదము వేయఁగ
యెడయని రతులకు నితవాయ
బడి శ్రీ వేంకటపతి నాకూటమి
తొడిఁబడ శుభముల దొంతరలాయ
(||pallavi||)
ĕvvaribhāgyaṁ bĕṭṭuṁḍuno
javvanabhāramu salivem̐ḍāya
(||ĕvva||)
tiruga nābĕ ninum̐ diṭṭulu diṭṭam̐ga
saravula nīgavi savulāya
girigŏna nīgu mŏkkina mā mŏkkulu
vĕravuna nīgavi vĕṁgĕmu lāya
(||ĕvva||)
tagulam̐gam̐ jĕli ninu tammanu veyam̐ga
nagavuna nīgadi nayamāya
vŏgi ne nappuḍu vŏsam̐gina kānuga
pagaḍuna nī kavi paṁgĕmulāya
(||ĕvva||)
paḍadi nīmīdanu pādamu veyam̐ga
yĕḍayani radulagu nidavāya
baḍi śhrī veṁkaḍabadi nāgūḍami
tŏḍim̐baḍa śhubhamula dŏṁtaralāya