Evvari mumdaram jese vitte vatti sadalellaa

ఎవ్వరి ముందరఁ జేసే విట్టె వట్టి సటలెల్లా
Language

(॥పల్లవి॥)
ఎవ్వరి ముందరఁ జేసే విట్టె వట్టి సటలెల్లా
నివ్వటిల్ల నీ విద్యలు నే నెఱఁగవా

(॥ఎవ్వ॥)
మొగమోటలేక యెంతమొక్కలాన నాపె నిన్ను
యెగసక్కే లాడినా నీ కింపులేకావా
తెగువలుమీర నట్టె దిమ్మరితనములను
నగినా నీ కవియెల్లా ననుపేకావా

(॥ఎవ్వ॥)
బలువుగాఁ దా మెరలఁబట్టి నీ మేను దాఁగ
చలమున వేసినానుచవులేకావా
కొలఁదిమీర నీచెక్కు కొనగోరిముద్రలు
వెలయఁగ గీరినాను వేడుకలేకాదా

(॥ఎవ్వ॥)
గుట్టుతోడ నీవురము గొప్పగొప్పచన్నులను
గట్టిగా దాఁకించిన నీఘనతేకాదా
యెట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మెట్టి యాకె నిన్నేలిన మేలేకాదా

(||pallavi||)
ĕvvari muṁdaram̐ jese viṭṭĕ vaṭṭi saḍalĕllā
nivvaḍilla nī vidyalu ne nĕṟam̐gavā

(||ĕvva||)
mŏgamoḍalega yĕṁtamŏkkalāna nābĕ ninnu
yĕgasakke lāḍinā nī kiṁpulegāvā
tĕguvalumīra naṭṭĕ dimmaridanamulanu
naginā nī kaviyĕllā nanubegāvā

(||ĕvva||)
baluvugām̐ dā mĕralam̐baṭṭi nī menu dām̐ga
salamuna vesinānusavulegāvā
kŏlam̐dimīra nīsĕkku kŏnagorimudralu
vĕlayam̐ga gīrinānu veḍugalegādā

(||ĕvva||)
guṭṭudoḍa nīvuramu gŏppagŏppasannulanu
gaṭṭigā dām̐kiṁchina nīghanadegādā
yĕṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
mĕṭṭi yāgĕ ninnelina melegādā