ఎవ్వరి మాటలు నేనేల వినేను
(॥పల్లవి॥)
ఎవ్వరి మాటలు నేనేల వినేను
దివ్వెలెత్త నియ్యవయ్య తేనెలు నించేను
(॥ఎవ్వ॥)
నవ్వులకుఁ గడమా నాకు నీవు గలిగుండి
రవ్వలుగ మీఁద మీఁద రాఁపు సేయఁగా
పువ్వువంటిదాన నేను పూఁపవంటి విభుఁడవు
బువ్వానకు రావయ్యా బుద్దిచెప్పే నేను
(॥ఎవ్వ॥)
సంతోసాలు బాఁతే సారె నీవిందరిలోనా
చింతదీర వేఁడుకొని చెక్కు నొక్కఁగా
పొంత నిదె నావలపు పొరుగే పోనీవావి
మంతనాన వినవయ్య మాట చెప్పే నేను
(॥ఎవ్వ॥)
ఆసకు లెక్కవున్నదా ఆయాలు మోవఁగ నీవు
సేసవెట్టి పెండ్లాడి చేరి కూడఁగా
వాసి నలమేల్ మంగను వడి శ్రీ వేంకటేశుఁడ
యీసులేక కూడితివి యెనశుండే నేను
(||pallavi||)
ĕvvari māḍalu nenela vinenu
divvĕlĕtta niyyavayya tenĕlu niṁchenu
(||ĕvva||)
navvulagum̐ gaḍamā nāgu nīvu galiguṁḍi
ravvaluga mīm̐da mīm̐da rām̐pu seyam̐gā
puvvuvaṁṭidāna nenu pūm̐pavaṁṭi vibhum̐ḍavu
buvvānagu rāvayyā buddisĕppe nenu
(||ĕvva||)
saṁtosālu bām̐te sārĕ nīviṁdarilonā
siṁtadīra vem̐ḍugŏni sĕkku nŏkkam̐gā
pŏṁta nidĕ nāvalabu pŏruge ponīvāvi
maṁtanāna vinavayya māḍa sĕppe nenu
(||ĕvva||)
āsagu lĕkkavunnadā āyālu movam̐ga nīvu
sesavĕṭṭi pĕṁḍlāḍi seri kūḍam̐gā
vāsi nalamel maṁganu vaḍi śhrī veṁkaḍeśhum̐ḍa
yīsulega kūḍidivi yĕnaśhuṁḍe nenu