ఎవ్వరేమి బోదింతురో యెఱఁగ నేను
(॥పల్లవి॥)
ఎవ్వరేమి బోదింతురో యెఱఁగ నేను
పువ్వువలె నన్నుఁ బొందేవు పుణ్యము నీచేతిది
(॥ఎవ్వ॥)
తరుణులలో నిన్ను తగవులఁ బెట్ట నోప
వొరసి నిన్ను మెప్పించనోపుదుఁ గాని
నెరతనీఁడవు నీవు నేరనిదాన నేను
పొరసి నన్ను నడపే పుణ్యము నీచేతిది
(॥ఎవ్వ॥)
వుక్కుమీరి నిన్నుఁ గడునొత్తి మాఁటలాడనోప
వొక్కటైతే నొడఁబడనోపుదుఁ గాని
నిక్కి నీవు ఱట్టడివి నేనైతే గోలదాన
పుక్కట గాక మన్నించే పుణ్యము నీచేతిది
(॥ఎవ్వ॥)
పలుమారు నీతోను పంతము లాడఁగనోప
వొలసి ప్రియము చెప్పనోపుదుఁగాని
యెలమి శ్రీ వేంకటేశ యిదె నన్నుఁ గూడితివి
పొలసి నన్ను రక్షించే పుణ్యము నీచేతిది
(||pallavi||)
ĕvvaremi bodiṁturo yĕṟam̐ga nenu
puvvuvalĕ nannum̐ bŏṁdevu puṇyamu nīsedidi
(||ĕvva||)
taruṇulalo ninnu tagavulam̐ bĕṭṭa noba
vŏrasi ninnu mĕppiṁchanobudum̐ gāni
nĕradanīm̐ḍavu nīvu neranidāna nenu
pŏrasi nannu naḍabe puṇyamu nīsedidi
(||ĕvva||)
vukkumīri ninnum̐ gaḍunŏtti mām̐ṭalāḍanoba
vŏkkaḍaide nŏḍam̐baḍanobudum̐ gāni
nikki nīvu ṟaṭṭaḍivi nenaide goladāna
pukkaḍa gāga manniṁche puṇyamu nīsedidi
(||ĕvva||)
palumāru nīdonu paṁtamu lāḍam̐ganoba
vŏlasi priyamu sĕppanobudum̐gāni
yĕlami śhrī veṁkaḍeśha yidĕ nannum̐ gūḍidivi
pŏlasi nannu rakṣhiṁche puṇyamu nīsedidi