Evvaramu nemiseppe midameemdanu

ఎవ్వరము నేమిచెప్పే మిటమీఁదను
Language

(॥పల్లవి॥)
ఎవ్వరము నేమిచెప్పే మిటమీఁదను
నివ్వటిల్లు ఘనుఁడవు నీచిత్త మిఁకను

(॥ఎవ్వ॥)
నిలువెల్లా వలపులే నెలఁతకు నేపొద్దు
పలుకెల్లా నీమీఁది పాటలందునే
తలఁపెల్ల నీపైతమకమే కలదెల్ల
నెలకొన్నపనులకు నీచిత్త మికను

(॥ఎవ్వ॥)
చూపులెల్లనీపైనే సుదతి కీపులకల-
మోపులెల్లా నీమీఁది మోచిదింపులే
తీపులయాసలు నీతేనెలమాటలందే
నీపాదమానసుమ్మీ నీచిత్త మిఁకను

(॥ఎవ్వ॥)
కాయము నీకాఁగిటనే కలికిజవ్వనపుఁ-
బాయమెల్ల నీరతి బంధములనే
యేయెడ శ్రీవేంకటేశ యీకెకు నీకుఁ దగు
నీయిచ్చలాయ నేడు నీచిత్తమికను

(||pallavi||)
ĕvvaramu nemisĕppe miḍamīm̐danu
nivvaḍillu ghanum̐ḍavu nīsitta mim̐kanu

(||ĕvva||)
niluvĕllā valabule nĕlam̐tagu nebŏddu
palugĕllā nīmīm̐di pāḍalaṁdune
talam̐pĕlla nībaidamagame kaladĕlla
nĕlagŏnnabanulagu nīsitta miganu

(||ĕvva||)
sūbulĕllanībaine sudadi kībulagala-
mobulĕllā nīmīm̐di mosidiṁpule
tībulayāsalu nīdenĕlamāḍalaṁde
nībādamānasummī nīsitta mim̐kanu

(||ĕvva||)
kāyamu nīgām̐giḍane kaligijavvanabum̐-
bāyamĕlla nīradi baṁdhamulane
yeyĕḍa śhrīveṁkaḍeśha yīgĕgu nīgum̐ dagu
nīyichchalāya neḍu nīsittamiganu