ఎవ్వ రేమనిరి నిన్ను వేగిరపడేవు
(॥పల్లవి॥)
ఎవ్వ రేమనిరి నిన్ను వేగిరపడేవు
జవ్వనపు మంకులేల చాలు నుండవయ్యా
(॥ఎవ్వ॥)
పంతపుమాటలకేమి పైపై నీ మోహము చూచితే
కాంతుఁడ నీగుణమెల్లాఁ గానరాదా
అంత కోపకాఁడవా అన్నిటా మంచివాఁడవే
సంతరొదలేల యీడఁజాలు నుండవయ్యా
(॥ఎవ్వ॥)
వొట్టులు వెట్టుకోనేల వొట్టే నించుక వుండితే
యిట్టె నీసరితలెల్లానెఱఁగరాదా
గట్టువాయవాఁడవా కడునేరుపరివే
జట్టి తరితీపులేల చాలు నుండవయ్యా
(॥ఎవ్వ॥)
నేమము వలుకనేలనేఁడు నిన్నుఁ గూడితిమి
దీమసపునీవలపు తెలియరాదా
గామిడివాఁడవాశ్రీవేంకటగిరి దేవుఁడవే
సాముల బిగువులేల చాలు నుండవయ్యా
(||pallavi||)
ĕvva remaniri ninnu vegirabaḍevu
javvanabu maṁkulela sālu nuṁḍavayyā
(||ĕvva||)
paṁtabumāḍalagemi paibai nī mohamu sūside
kāṁtum̐ḍa nīguṇamĕllām̐ gānarādā
aṁta kobagām̐ḍavā anniḍā maṁchivām̐ḍave
saṁtarŏdalela yīḍam̐jālu nuṁḍavayyā
(||ĕvva||)
vŏṭṭulu vĕṭṭugonela vŏṭṭe niṁchuga vuṁḍide
yiṭṭĕ nīsaridalĕllānĕṟam̐garādā
gaṭṭuvāyavām̐ḍavā kaḍunerubarive
jaṭṭi taridībulela sālu nuṁḍavayyā
(||ĕvva||)
nemamu valuganelanem̐ḍu ninnum̐ gūḍidimi
dīmasabunīvalabu tĕliyarādā
gāmiḍivām̐ḍavāśhrīveṁkaḍagiri devum̐ḍave
sāmula biguvulela sālu nuṁḍavayyā