ఎవరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు
పల్లవి:
ఎవరు లేరని అనకు.. తోడుంటా నీ కడ వరకు
చీకటిలోన వెలుగౌతా నీ కొరకు
ఎపుడు ఒంటరి అనకు.. నీతోనే చావు బ్రతుకు
కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు
ప్రేమతోటి చెంప నిమరన
గుండె చాటు భాధ చెరపన.. నీ ఊపిరే అవ్వనా
గడిచిన కాలమేదో గాయపరచిన
జ్ఞాపకాల చేదు మిగిలిన మైమరపించే హాయవ్వనా
ఒట్టేసి నేను చెబుతున్నా వదిలుండలేను క్షణమైనా
నీ సంతోషానికి హామీ ఇస్తున్నా
ఎవరు లేరని అనకు.. తోడుంటా నీ కడ వరకు
చీకటిలోన వెలుగౌతా నీ కొరకు
చరణం 1:
నా మనసే నీకివ్వనా.. నీలోనే సగమవ్వనా
అరచేతులు కలిపే చెలిమే నేనవనా
ముద్దుల్లో ముంచేయనా.. కౌగిలిలో దాచేయనా
నాకన్నా ఇష్టం నువ్వే అంటున్నా
తడిసొస్తే తల తుడిచే చీరంచుగ నేనే మారనా
అలిసొస్తే ఎపుడైనా నా ఒడినే ఊయల చేస్తానంటున్నా..
ఎవరు లేరని అనకు.. తోడుంటా నీ కడ వరకు
చీకటిలోన వెలుగౌతా నీ కొరకు
చరణం 2:
నిను పిల్చే పిలుపవ్వనా.. నిను వెతికే చూపవ్వనా
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా
నిను తలచే తలపవ్వనా.. నీ కథలో మలుపవ్వనా
ఏడడుగుల బంధం నీతో అనుకోనా
మనసంతా దిగులైతే నిను ఎత్తుకు సముదాయించనా
నీకోసం తపనపడి నీ అమ్మా నాన్న అన్నీ నేనవనా
ఎవరు లేరని అనకు.. తోడుంటా నీ కడ వరకు
చీకటిలోన వెలుగౌతా నీ కొరకు..
pallavi:
ĕvaru lerani anagu.. toḍuṁṭā nī kaḍa varagu
sīgaḍilona vĕlugaudā nī kŏragu
ĕbuḍu ŏṁṭari anagu.. nīdone sāvu bradugu
kaṁṭigi rĕppai uṁṭāle tudi varagu
premadoḍi sĕṁpa nimarana
guṁḍĕ sāḍu bhādha sĕrabana.. nī ūbire avvanā
gaḍisina kālamedo gāyabarasina
jñābagāla sedu migilina maimarabiṁche hāyavvanā
ŏṭṭesi nenu sĕbudunnā vadiluṁḍalenu kṣhaṇamainā
nī saṁtoṣhānigi hāmī istunnā
ĕvaru lerani anagu.. toḍuṁṭā nī kaḍa varagu
sīgaḍilona vĕlugaudā nī kŏragu
saraṇaṁ 1:
nā manase nīgivvanā.. nīlone sagamavvanā
arasedulu kalibe sĕlime nenavanā
muddullo muṁcheyanā.. kaugililo dāseyanā
nāgannā iṣhṭaṁ nuvve aṁṭunnā
taḍisŏste tala tuḍise sīraṁchuga nene māranā
alisŏste ĕbuḍainā nā ŏḍine ūyala sestānaṁṭunnā..
ĕvaru lerani anagu.. toḍuṁṭā nī kaḍa varagu
sīgaḍilona vĕlugaudā nī kŏragu
saraṇaṁ 2:
ninu pilse pilubavvanā.. ninu vĕdige sūbavvanā
nī kannula vāgiḍa mĕrise mĕrubavanā
ninu talase talabavvanā.. nī kathalo malubavvanā
eḍaḍugula baṁdhaṁ nīdo anugonā
manasaṁtā digulaide ninu ĕttugu samudāyiṁchanā
nīgosaṁ tabanabaḍi nī ammā nānna annī nenavanā
ĕvaru lerani anagu.. toḍuṁṭā nī kaḍa varagu
sīgaḍilona vĕlugaudā nī kŏragu..