Ettusesina neesemta keppudu lone nemu

ఎట్టుసేసిన నీచేఁత కెప్పుడు లోనే నేము
Language

(॥పల్లవి॥)
ఎట్టుసేసిన నీచేఁత కెప్పుడు లోనే నేము
బట్టబయలీఁదనేల భాగ్యము నీచేతిది

(॥ఎట్టు॥)
చెలువుఁడవు నీ వేమి చెప్పిన వినేముగాక
చలమరితనమేల సాదించనేల
వలచినవారము వద్దనే వుండేముగాక
అలిగి పండుండనేల అవుఁగాదననేల

(॥ఎట్టు॥)
యేలినవాఁడవు నీయిచ్చ మెలంగేముగాక
జోలిమాట లాడనేల సొలయనేల
నీలోని వారము నిండుకవుండేముగాక
జాలి నీకు రేఁచనేల జంకించనేల

(॥ఎట్టు॥)
శ్రీవేంకటేశ్వరుఁడవు చేకొని మొక్కేముగాక
పూవుల వేయఁగనేల పొనుంగనేల
యీవేళ నలమేల్ మంగ నిటు నీకాఁగిటిదాన
వేవేలుగాఁ గూడితివి వేసరించనేల

(||pallavi||)
ĕṭṭusesina nīsem̐ta kĕppuḍu lone nemu
baṭṭabayalīm̐danela bhāgyamu nīsedidi

(||ĕṭṭu||)
sĕluvum̐ḍavu nī vemi sĕppina vinemugāga
salamaridanamela sādiṁchanela
valasinavāramu vaddane vuṁḍemugāga
aligi paṁḍuṁḍanela avum̐gādananela

(||ĕṭṭu||)
yelinavām̐ḍavu nīyichcha mĕlaṁgemugāga
jolimāḍa lāḍanela sŏlayanela
nīloni vāramu niṁḍugavuṁḍemugāga
jāli nīgu rem̐sanela jaṁkiṁchanela

(||ĕṭṭu||)
śhrīveṁkaḍeśhvarum̐ḍavu segŏni mŏkkemugāga
pūvula veyam̐ganela pŏnuṁganela
yīveḽa nalamel maṁga niḍu nīgām̐giḍidāna
vevelugām̐ gūḍidivi vesariṁchanela