Ettunnado nee sittamu yeṟamgamayyaa

ఎట్టున్నదో నీ చిత్తము యెఱఁగమయ్యా
Language

(॥పల్లవి॥)
ఎట్టున్నదో నీ చిత్తము యెఱఁగమయ్యా
చుట్టపు వరుసలివి చూచుకొనేవయ్యా

(॥ఎట్టు॥)
చెలిచే నప్పుడు నీవు చెప్పి పంపిన సుద్దులు
వెలఁది వేడుకతోడ వినెనయ్యా
వలపులు లేకలపై వాఁతలఁ జదువుకొని
నలిరేఁగి పకపక నవ్వెనయ్యా

(॥ఎట్టు॥)
అచ్చలాన నీ వుంగర మానవాలు చూచుకొని
ముచ్చటతోఁ జేతులెత్తి మొక్కెనయ్యా
మచ్చిక నీవు మన్నించే మన్నన దలఁచుకొని
కచ్చు పెట్టి సంతోసానఁ గడుఁ బొగడేనయ్యా

(॥ఎట్టు॥)
కడు బత్తి సేసి నీవు కాఁగిలించుకొన్నందుకు
కడఁకతోడ మనసు గరఁగెనయ్యా
యెడయక శ్రీవేంకటేశ నీ గుణ మెరిఁగి
బడివాయనని నీతో బతిమి వట్టెనయ్యా

(||pallavi||)
ĕṭṭunnado nī sittamu yĕṟam̐gamayyā
suṭṭabu varusalivi sūsugŏnevayyā

(||ĕṭṭu||)
sĕlise nappuḍu nīvu sĕppi paṁpina suddulu
vĕlam̐di veḍugadoḍa vinĕnayyā
valabulu legalabai vām̐talam̐ jaduvugŏni
nalirem̐gi pagabaga navvĕnayyā

(||ĕṭṭu||)
achchalāna nī vuṁgara mānavālu sūsugŏni
muchchaḍadom̐ jedulĕtti mŏkkĕnayyā
machchiga nīvu manniṁche mannana dalam̐sugŏni
kachchu pĕṭṭi saṁtosānam̐ gaḍum̐ bŏgaḍenayyā

(||ĕṭṭu||)
kaḍu batti sesi nīvu kām̐giliṁchugŏnnaṁdugu
kaḍam̐kadoḍa manasu garam̐gĕnayyā
yĕḍayaga śhrīveṁkaḍeśha nī guṇa mĕrim̐gi
baḍivāyanani nīdo badimi vaṭṭĕnayyā