ఎట్టుండునో పతిచిత్త మించుకంతా నెఱఁగవు
(॥పల్లవి॥)
ఎట్టుండునో పతిచిత్త మించుకంతా నెఱఁగవు
గుట్టుతోడ నుండఁగదే కూడీఁ దానే ఇతఁడు
(॥ఎటుపం॥)
చేరి నే వలతునంటాఁ జెప్పుకొననేఁటికే
సారెసారె నాతనితో చవులుగాను
గోరు దాఁకించెనంటాను కొసరఁగనేఁటికే
జీర చూపే విందరికి సిగ్గువడ కిపుడు
(॥ఎటుపం॥)
అచ్చువ్రాసుకొంటినంటా నక్కు చూపనేఁటికే
కొచ్చికొచ్చి యాతనికి గురుతుగాను
తచ్చి తొంటిపొందులెల్లాఁ దారుకాణించనేఁటికే
యిచ్చల నవ్వేవారి నెంచక నీ విపుడు
(॥ఎటుపం॥)
మరిగివుందాననంటా మదలించనేఁటికే
పోరిఁబొరి నీతనికి పొందులుగాను
ఆరిది శ్రీవేంకటేశు నలమేల్‌మంగపతిని
సరుసఁ గాఁగిలించేవు చనవుతో నిపుడు
(||pallavi||)
ĕṭṭuṁḍuno padisitta miṁchugaṁtā nĕṟam̐gavu
guṭṭudoḍa nuṁḍam̐gade kūḍīm̐ dāne idam̐ḍu
(||ĕḍubaṁ||)
seri ne valadunaṁṭām̐ jĕppugŏnanem̐ṭige
sārĕsārĕ nādanido savulugānu
goru dām̐kiṁchĕnaṁṭānu kŏsaram̐ganem̐ṭige
jīra sūbe viṁdarigi sigguvaḍa kibuḍu
(||ĕḍubaṁ||)
achchuvrāsugŏṁṭinaṁṭā nakku sūbanem̐ṭige
kŏchchigŏchchi yādanigi gurudugānu
tachchi tŏṁṭibŏṁdulĕllām̐ dārugāṇiṁchanem̐ṭige
yichchala navvevāri nĕṁchaga nī vibuḍu
(||ĕḍubaṁ||)
marigivuṁdānanaṁṭā madaliṁchanem̐ṭige
porim̐bŏri nīdanigi pŏṁdulugānu
āridi śhrīveṁkaḍeśhu nalamelmaṁgabadini
sarusam̐ gām̐giliṁchevu sanavudo nibuḍu