ఎట్టు వలపించితో యాపెను నీవు
(॥పల్లవి॥)
ఎట్టు వలపించితో యాపెను నీవు
నెట్టన నీవిన్నిటాను నెరజాణవయ్యా
(॥ఎట్టు॥)
ననుపుసేసుక నీతో నవ్వులు నవ్వీఁ జెలి
పెనఁగి నీపైఁ గూరిమి పెంచీ నిట్టే
తనివోవ కప్పటిని తప్పక చూచీఁ దాను
యెనసె రతుల యాస యెంతోకాని
(॥ఎట్టు॥)
చేరి చేరి వినయాన సేవలు సేసీ నీకు
నేరుపులెల్లా చూపి నిన్నుఁ గొసరీ
సారెకు నీమీఁదను చల్లీఁ దమకములు
కూరి మెంత మూటగట్టుకొనీనో కాని
(॥ఎట్టు॥)
కాఁటపుగుబ్బల నొత్తి కాఁగిలించుకొని నిన్ను
మాఁటలే యడుగుతాను మతిఁజొక్కీని
యాఁటాన శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
తేటల దానింకా నెంత తెలిపె(పీ?) నో కాని
(||pallavi||)
ĕṭṭu valabiṁchido yābĕnu nīvu
nĕṭṭana nīvinniḍānu nĕrajāṇavayyā
(||ĕṭṭu||)
nanubusesuga nīdo navvulu navvīm̐ jĕli
pĕnam̐gi nībaim̐ gūrimi pĕṁchī niṭṭe
tanivova kappaḍini tappaga sūsīm̐ dānu
yĕnasĕ radula yāsa yĕṁtogāni
(||ĕṭṭu||)
seri seri vinayāna sevalu sesī nīgu
nerubulĕllā sūbi ninnum̐ gŏsarī
sārĕgu nīmīm̐danu sallīm̐ damagamulu
kūri mĕṁta mūḍagaṭṭugŏnīno kāni
(||ĕṭṭu||)
kām̐ṭabugubbala nŏtti kām̐giliṁchugŏni ninnu
mām̐ṭale yaḍugudānu madim̐jŏkkīni
yām̐ṭāna śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
teḍala dāniṁkā nĕṁta tĕlibĕ(pī?) no kāni