ఎట్టు సమకూడెనో మీకు నిద్దరికిని
(॥పల్లవి॥)
ఎట్టు సమకూడెనో మీకు నిద్దరికిని
చుట్టరికములలో నీ చుట్టరికము
(॥ఎట్టు॥)
కొమ్మ మనసులోపలి కోరికలు
చిమ్ముల నీ కాఁగిటిలో చేరికలు
కుమ్మరింపుఁ జూపుల కొమ్మెరుఁగులు
నెమ్మది మరుతంత్రాల నెక్కొన్న కరఁగులు
(॥ఎట్టు॥)
వలపుల కతలతో వాడికలు
వెలసిన వొడఁబాటు వేడికలు
మలసిన సరసపు మచ్చికలు
అలవాటైన రతుల అచ్చికబుచ్చికలు
(॥ఎట్టు॥)
తనిసిన కాఁగిటిలో తాలిములు
మినుకు టానందముల మేలిములు
నినుఁ బెండ్లాడిన యీకె నిచ్చపొందులు
మునుపె శ్రీవేంకటేశ మోవి తేనె విందులు
(||pallavi||)
ĕṭṭu samagūḍĕno mīgu niddarigini
suṭṭarigamulalo nī suṭṭarigamu
(||ĕṭṭu||)
kŏmma manasulobali korigalu
simmula nī kām̐giḍilo serigalu
kummariṁpum̐ jūbula kŏmmĕrum̐gulu
nĕmmadi marudaṁtrāla nĕkkŏnna karam̐gulu
(||ĕṭṭu||)
valabula kadalado vāḍigalu
vĕlasina vŏḍam̐bāḍu veḍigalu
malasina sarasabu machchigalu
alavāḍaina radula achchigabuchchigalu
(||ĕṭṭu||)
tanisina kām̐giḍilo tālimulu
minugu ṭānaṁdamula melimulu
ninum̐ bĕṁḍlāḍina yīgĕ nichchabŏṁdulu
munubĕ śhrīveṁkaḍeśha movi tenĕ viṁdulu