ఎట్టు సాదించవచ్చునే యిటువంటి మగవాని
(॥పల్లవి॥)
ఎట్టు సాదించవచ్చునే యిటువంటి మగవాని
నెట్టనఁ దనంతనే మన్నించితేఁ గాక
(॥ఎట్టు॥)
సెలవినే నవ్వుఁగాని చెప్పఁడే తనగుట్టు
సొలసి యెంత వొరసి చూచినాను
చెలి మేలేసేసుఁగాని చేతికి లోనుగాఁడే
పిలిచి పైకొని యెంత పెనఁగినాను
(॥ఎట్టు॥)
మాటలే యాడుఁగాని మనసు గరఁగఁడే
చీటికి మాటికి యెంత చెనకినాను
తేటలనే తేలుఁగాని తెమలి యసమియ్యఁడే
కూటమికి నే నెంత కొసరినాను
(॥ఎట్టు॥)
ఆసలే పుట్టించుఁగాని అంకెకు తాఁ జిక్కఁడే
వేసరక యం(యెం?) తేసి వేఁడుకొనినా
బాసయిచ్చి శ్రీవేంకటపతి నన్నుఁదానే కూడె
పాసిపోఁడే యిఁక నెంత బలిమిసేసినాను
(||pallavi||)
ĕṭṭu sādiṁchavachchune yiḍuvaṁṭi magavāni
nĕṭṭanam̐ danaṁtane manniṁchidem̐ gāga
(||ĕṭṭu||)
sĕlavine navvum̐gāni sĕppam̐ḍe tanaguṭṭu
sŏlasi yĕṁta vŏrasi sūsinānu
sĕli melesesum̐gāni sedigi lonugām̐ḍe
pilisi paigŏni yĕṁta pĕnam̐ginānu
(||ĕṭṭu||)
māḍale yāḍum̐gāni manasu garam̐gam̐ḍe
sīḍigi māḍigi yĕṁta sĕnaginānu
teḍalane telum̐gāni tĕmali yasamiyyam̐ḍe
kūḍamigi ne nĕṁta kŏsarinānu
(||ĕṭṭu||)
āsale puṭṭiṁchum̐gāni aṁkĕgu tām̐ jikkam̐ḍe
vesaraga yaṁ(yĕṁ?) tesi vem̐ḍugŏninā
bāsayichchi śhrīveṁkaḍabadi nannum̐dāne kūḍĕ
pāsibom̐ḍe yim̐ka nĕṁta balimisesinānu