Ettu nammavachchu ninnu niduvamti yamdagaani

ఎట్టు నమ్మవచ్చు నిన్ను నిటువంటి యందగాని
Language

(॥పల్లవి॥)
ఎట్టు నమ్మవచ్చు నిన్ను నిటువంటి యందగాని
పట్టపగలే నీచేఁత పచ్చాయఁగా

(॥ఎట్టు॥)
మల్లడి నీతో నలిగి మారుమోమై యున్నవేళ
చల్లువలపులు నీకుఁ జవులాయఁగా
యిల్లిదె యింతలో నీతో నేకము నేనైనవేళ
వెల్లవిరి నవియెల్లా వెగటాయఁగా

(॥ఎట్టు॥)
చెఱఁగుమాసి నేఁ జెక్కుచేతితో నున్నవేళ
యెఱుకతో సరసాలే యింపాయఁగా
చిఱుతనై నాలుగునాళ్లు చేసియున్నవేళఁ జూచి
మొఱఁగులపనులెల్లా మొగచాట్లాయఁగా

(॥ఎట్టు॥)
కాఁగిటికి నెదుగక కన్నె నేనై యున్న వేళ
తోఁగిచూపులే నీకే తొడుసాయఁగా
వీఁగక శ్రీవేంకటేశ వెస నేఁ గూడినవేళ
మాఁగినతొల్లిటివెల్లా మఱపాయఁగా

(||pallavi||)
ĕṭṭu nammavachchu ninnu niḍuvaṁṭi yaṁdagāni
paṭṭabagale nīsem̐ta pachchāyam̐gā

(||ĕṭṭu||)
mallaḍi nīdo naligi mārumomai yunnaveḽa
salluvalabulu nīgum̐ javulāyam̐gā
yillidĕ yiṁtalo nīdo negamu nenainaveḽa
vĕllaviri naviyĕllā vĕgaḍāyam̐gā

(||ĕṭṭu||)
sĕṟam̐gumāsi nem̐ jĕkkusedido nunnaveḽa
yĕṟugado sarasāle yiṁpāyam̐gā
siṟudanai nālugunāḽlu sesiyunnaveḽam̐ jūsi
mŏṟam̐gulabanulĕllā mŏgasāṭlāyam̐gā

(||ĕṭṭu||)
kām̐giḍigi nĕdugaga kannĕ nenai yunna veḽa
tom̐gisūbule nīge tŏḍusāyam̐gā
vīm̐gaga śhrīveṁkaḍeśha vĕsa nem̐ gūḍinaveḽa
mām̐ginadŏlliḍivĕllā maṟabāyam̐gā