Ettu maṟavamgavachchu yiduvamti semtalu naa

ఎట్టు మఱవఁగవచ్చు యిటువంటి చేఁతలు నా
Language

(॥పల్లవి॥)
ఎట్టు మఱవఁగవచ్చు యిటువంటి చేఁతలు నా-
గుట్టు చేకొంటివిగా నీ కుచ్చితానను

(॥ఎట్టు॥)
నవ్వులే సారెకు నవ్వి నావలపు లిందరిలో
రవ్వలఁ బెట్టితివిగా రాజసానను
పువ్వులనే వేసివేసి పొద్దులు గడపి యాస
లువ్విళ్లూరించితిగా వుదుటునను

(॥ఎట్టు॥)
మాటలే ఇందాఁకా నాడి మర్మములు గరఁగించి
నాటకమే చూపేవుగా నమ్మికతోను
పాటించి సేవలుగొని బయలీఁతలనే పెట్టి
జూటవై మించితివిగా చుట్టరికమునను

(॥ఎట్టు॥)
చేతులు పైఁ జాఁచి చాఁచి సిగ్గులు వడఁగఁజేసి
జాతులఁ బెట్టితివిగా సరాసానను
యేతుల శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కాతరాన మీరేవుగా కాఁగిటిలోను

(||pallavi||)
ĕṭṭu maṟavam̐gavachchu yiḍuvaṁṭi sem̐talu nā-
guṭṭu segŏṁṭivigā nī kuchchidānanu

(||ĕṭṭu||)
navvule sārĕgu navvi nāvalabu liṁdarilo
ravvalam̐ bĕṭṭidivigā rājasānanu
puvvulane vesivesi pŏddulu gaḍabi yāsa
luvviḽlūriṁchidigā vuduḍunanu

(||ĕṭṭu||)
māḍale iṁdām̐kā nāḍi marmamulu garam̐giṁchi
nāḍagame sūbevugā nammigadonu
pāḍiṁchi sevalugŏni bayalīm̐talane pĕṭṭi
jūḍavai miṁchidivigā suṭṭarigamunanu

(||ĕṭṭu||)
sedulu paim̐ jām̐si sām̐si siggulu vaḍam̐gam̐jesi
jādulam̐ bĕṭṭidivigā sarāsānanu
yedula śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kādarāna mīrevugā kām̐giḍilonu