Ettu maṟavamgavachchu niduvamti nee suddulu

ఎట్టు మఱవఁగవచ్చు నిటువంటి నీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఎట్టు మఱవఁగవచ్చు నిటువంటి నీ సుద్దులు
చుట్టమవైతివిగా సులభాన నిపుడు

(॥ఎట్టు॥)
నిగిడి నిన్ను జంకించి నే నాడినమాటలకు
నగితివిగా నీవు నాతోను
జిగి నీలుజాలమీఁద చేతులు చాఁచినందుకు
మొగము చూచితిగా మోదముతో నేఁడు

(॥ఎట్టు॥)
ఇచ్చకముతో నీకుఁ జేయెత్తి మొక్కినయందుకు
మెచ్చితివిగా నీవు మీఁదమీఁద
పచ్చిగా పానుమీఁద పాదములొత్తినందుకు
కుచ్చితివిగా కాఁగిట గురుతుగా నన్నును

(॥ఎట్టు॥)
వొక్కటై ఇందాఁకా కొలువులు సేసినయందుకు
తొక్కితివిగా పాదము దోమటిగాను
ఇక్కువ నన్నేలితివి ఇంతలో శ్రీవేంకటేశ
చిక్కితివిగా నాపాల చెల్లుబడి నిచటా

(||pallavi||)
ĕṭṭu maṟavam̐gavachchu niḍuvaṁṭi nī suddulu
suṭṭamavaidivigā sulabhāna nibuḍu

(||ĕṭṭu||)
nigiḍi ninnu jaṁkiṁchi ne nāḍinamāḍalagu
nagidivigā nīvu nādonu
jigi nīlujālamīm̐da sedulu sām̐sinaṁdugu
mŏgamu sūsidigā modamudo nem̐ḍu

(||ĕṭṭu||)
ichchagamudo nīgum̐ jeyĕtti mŏkkinayaṁdugu
mĕchchidivigā nīvu mīm̐damīm̐da
pachchigā pānumīm̐da pādamulŏttinaṁdugu
kuchchidivigā kām̐giḍa gurudugā nannunu

(||ĕṭṭu||)
vŏkkaḍai iṁdām̐kā kŏluvulu sesinayaṁdugu
tŏkkidivigā pādamu domaḍigānu
ikkuva nannelidivi iṁtalo śhrīveṁkaḍeśha
sikkidivigā nābāla sĕllubaḍi nisaḍā