ఎట్టు మన్నించేవోకాని యిట తరవాతను
(॥పల్లవి॥)
ఎట్టు మన్నించేవోకాని యిట తరవాతను
చుట్టరికము లెల్లాను చూపి చెప్పఁగా
(॥ఎట్టు॥)
కప్పురము గానుకిచ్చి కడు వినయముతోడ
చెప్పెఁగా నీకుఁ బ్రియము చెలియా
అప్పటిని పొందులకు నాసపడి నీ మాఁటలు
వొప్పుగొని కడునమ్మివుండెఁగాఁ తాను
(॥ఎట్టు॥)
కదిసి వద్దఁ గూచుండి కంకణాలు గల్లనఁగా
మొదలనే చేతులెత్తి మొక్కెఁగా నీకు
సదరాన నీతోను సరసము లాడి యాడి
మదనకేలికిఁ జొక్కి మరిగెఁగా నిన్నును
(॥ఎట్టు॥)
చెక్కులఁ జెమటగార సేవలెల్లాఁ జేసి సేసి
మిక్కిలి కాఁగిట నించి మెచ్చెఁగా నేఁడు
యిక్కడ శ్రీవేంకటేశ యేలితి విప్పు డీకెను
వెక్కసపు సంతోసాన వెలసెఁగా యిపుడు
(||pallavi||)
ĕṭṭu manniṁchevogāni yiḍa taravādanu
suṭṭarigamu lĕllānu sūbi sĕppam̐gā
(||ĕṭṭu||)
kappuramu gānugichchi kaḍu vinayamudoḍa
sĕppĕm̐gā nīgum̐ briyamu sĕliyā
appaḍini pŏṁdulagu nāsabaḍi nī mām̐ṭalu
vŏppugŏni kaḍunammivuṁḍĕm̐gām̐ tānu
(||ĕṭṭu||)
kadisi vaddam̐ gūsuṁḍi kaṁkaṇālu gallanam̐gā
mŏdalane sedulĕtti mŏkkĕm̐gā nīgu
sadarāna nīdonu sarasamu lāḍi yāḍi
madanageligim̐ jŏkki marigĕm̐gā ninnunu
(||ĕṭṭu||)
sĕkkulam̐ jĕmaḍagāra sevalĕllām̐ jesi sesi
mikkili kām̐giḍa niṁchi mĕchchĕm̐gā nem̐ḍu
yikkaḍa śhrīveṁkaḍeśha yelidi vippu ḍīgĕnu
vĕkkasabu saṁtosāna vĕlasĕm̐gā yibuḍu