Ettorusugunnaamdavo yaabe se se semtalagu

ఎట్టోరుచుకున్నాఁడవో యాపె సే సే చేఁతలకు
Language

(॥పల్లవి॥)
ఎట్టోరుచుకున్నాఁడవో యాపె సే సే చేఁతలకు
అట్టె నేము చూచి చూచి ఆఁపలేము నవ్పులు

(॥ఎట్టో॥)
నెత్తము పందెముతోడ నేను నీవు నాడఁగాను
యెత్తుచెప్పీ నీకు నాపె యెవ్వతోకాని
హత్తుక వద్దఁగూచుండి ఆటచూచేపరాకున
గుత్తపుగుబ్బల నొత్తీ కుమ్మెలుగా నీమేను

(॥ఎట్టో॥)
నేను నీవు నెదురు కిన్నెరలు వాఇంచుకోఁగా
తానాలు నీకు నేరిపీఁ దానెవ్వతో
వీనుల నీవాద్యాలు వినేటివేడుకలను
మేను బిగ్గెఁ గాఁగిలించి మెచ్చీ పిరివీకుగా

(॥ఎట్టో॥)
కందువ నిద్దరమును కతలు చెప్పుకోఁగాను
సందడి నూఁకొనిఁ దా నీసతి యెవ్వతో
చెంది నన్ను నేలితివి శ్రీవేంకేశుఁడ
అందె యెచ్చరికకు గోరంటించీ నీమెనను

(||pallavi||)
ĕṭṭorusugunnām̐ḍavo yābĕ se se sem̐talagu
aṭṭĕ nemu sūsi sūsi ām̐palemu navpulu

(||ĕṭṭo||)
nĕttamu paṁdĕmudoḍa nenu nīvu nāḍam̐gānu
yĕttusĕppī nīgu nābĕ yĕvvadogāni
hattuga vaddam̐gūsuṁḍi āḍasūsebarāguna
guttabugubbala nŏttī kummĕlugā nīmenu

(||ĕṭṭo||)
nenu nīvu nĕduru kinnĕralu vāiṁchugom̐gā
tānālu nīgu neribīm̐ dānĕvvado
vīnula nīvādyālu vineḍiveḍugalanu
menu biggĕm̐ gām̐giliṁchi mĕchchī pirivīgugā

(||ĕṭṭo||)
kaṁduva niddaramunu kadalu sĕppugom̐gānu
saṁdaḍi nūm̐kŏnim̐ dā nīsadi yĕvvado
sĕṁdi nannu nelidivi śhrīveṁkeśhum̐ḍa
aṁdĕ yĕchcharigagu goraṁṭiṁchī nīmĕnanu