Ettorusugunnaamdavo iduvamti valabulu

ఎట్టోరుచుకున్నాఁడవో ఇటువంటి వలపులు
Language

(॥పల్లవి॥)
ఎట్టోరుచుకున్నాఁడవో ఇటువంటి వలపులు
దట్టపు నీ శాంతానకు దయవుట్టీ నాకు

(॥ఎట్టో ॥)
యెక్కడ నెప్పుడు నిన్ను నెవ్వతె సేసెనో నీ-
చెక్కులరేకలు చూచి చిమిడీ మతి
మొక్కలాన నప్పటి నీ ముంగురులు నొసలిపై
చిక్కువడ్డవెల్లాఁ జూచి చెమరించీ నేను

(॥ఎట్టో॥)
బెడిదమై మరెవ్వతె పెనఁగి నిన్నోడించెనో
కడునీయలపు చూచి కంపించీ నేను
తొడిబడ నదె మోవితుదనున్నగంటి చూచి
కడలేని చింతతోడ కంటగించీ మొగము

(॥ఎట్టో॥)
జట్టిగొని మరెవ్వతె చన్నుల నిన్నొత్తెనో
గట్టి నీవురము చూచి కరఁగీ గుండె
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
నెట్టన నీరతి చూచి నిగిడీ నానందము

(||pallavi||)
ĕṭṭorusugunnām̐ḍavo iḍuvaṁṭi valabulu
daṭṭabu nī śhāṁtānagu dayavuṭṭī nāgu

(||ĕṭṭo ||)
yĕkkaḍa nĕppuḍu ninnu nĕvvadĕ sesĕno nī-
sĕkkularegalu sūsi simiḍī madi
mŏkkalāna nappaḍi nī muṁgurulu nŏsalibai
sikkuvaḍḍavĕllām̐ jūsi sĕmariṁchī nenu

(||ĕṭṭo||)
bĕḍidamai marĕvvadĕ pĕnam̐gi ninnoḍiṁchĕno
kaḍunīyalabu sūsi kaṁpiṁchī nenu
tŏḍibaḍa nadĕ movidudanunnagaṁṭi sūsi
kaḍaleni siṁtadoḍa kaṁṭagiṁchī mŏgamu

(||ĕṭṭo||)
jaṭṭigŏni marĕvvadĕ sannula ninnŏttĕno
gaṭṭi nīvuramu sūsi karam̐gī guṁḍĕ
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
nĕṭṭana nīradi sūsi nigiḍī nānaṁdamu