ఎట్టి సంతోసపు సుద్దు లిటు వినవే చెలియ
(॥పల్లవి॥)
ఎట్టి సంతోసపు సుద్దు లిటు వినవే చెలియ
గట్టిగా నాతని మేలు కానవచ్చె నిదిగో
(॥ఎట్టి॥)
సరివచ్చెఁ గదె మన సగినాలు
వరుస నావున్నాఁడకు వచ్చె నాతఁడు
నిరతి నేఁ గన్నకల నిక్కలాయనే
సరసములాడి నాకుఁ జనవిచ్చె నిపుడు
(॥ఎట్టి॥)
తారుకాణలాయఁగదె తలపోఁతలు
చేరి యాదరించి బత్తిసేసె నాపైని
యీరీతి ఫలించెఁగరె హెచ్చి నా నోము
గారవాన నిదె నాకుఁ గయివసమైనాఁడు
(॥ఎట్టి॥)
ప్రతివచ్చెఁ గదవె నా పలుకు లివి
గతియై యీతఁడు నన్నుఁ గరణించెను
రతికెక్కెఁ గదవె కాఁపురము లెల్లాను
యితవై శ్రీవేంకటేశుఁ డేలె నిట్టె నన్నును
(||pallavi||)
ĕṭṭi saṁtosabu suddu liḍu vinave sĕliya
gaṭṭigā nādani melu kānavachchĕ nidigo
(||ĕṭṭi||)
sarivachchĕm̐ gadĕ mana saginālu
varusa nāvunnām̐ḍagu vachchĕ nādam̐ḍu
niradi nem̐ gannagala nikkalāyane
sarasamulāḍi nāgum̐ janavichchĕ nibuḍu
(||ĕṭṭi||)
tārugāṇalāyam̐gadĕ talabom̐talu
seri yādariṁchi battisesĕ nābaini
yīrīdi phaliṁchĕm̐garĕ hĕchchi nā nomu
gāravāna nidĕ nāgum̐ gayivasamainām̐ḍu
(||ĕṭṭi||)
pradivachchĕm̐ gadavĕ nā palugu livi
gadiyai yīdam̐ḍu nannum̐ garaṇiṁchĕnu
radigĕkkĕm̐ gadavĕ kām̐puramu lĕllānu
yidavai śhrīveṁkaḍeśhum̐ ḍelĕ niṭṭĕ nannunu