ఎట్టయిన నేమి నీవు యేమన్న నేమి నీవు
(॥పల్లవి॥)
ఎట్టయిన నేమి నీవు యేమన్న నేమి నీవు
యిట్టె లోనయ్యేవు యింత చాలదా
(॥ఎట్ట॥)
కొమ్మ నీచే నాతఁ డంత కోపానఁ బడెనేమి
తమ్మిపువ్వు వాటు నొవ్వఁదాకిననేమి
అమ్మ నీ వవ్వలిమొగమైనా నాతనికేమి
ఇమ్ముల యెదుట నున్నాఁ డింతచాలదా
(॥ఎట్ట॥)
మగువ నీ కతనితో మాడాడకున్న నేమి
నొగిలి యాతఁడు నీచే నొచ్చిన నేమి
మొగమీక నీవెంత మోవఁగ నాడిననేమి
నగకున్నఁ గన్నులనే నవ్వు చాలదా
(॥ఎట్ట॥)
ఆది గొని నీ వతని కడ్డము లాడిననేమి
వేదనల నిప్పుడెంత వేఁచిన నేమి
ఆదరించే వేంకటేశుఁ డలమేలుమంగనాచా-
రీదెసఁ బిలువుమనీ నింతచాలదా
(||pallavi||)
ĕṭṭayina nemi nīvu yemanna nemi nīvu
yiṭṭĕ lonayyevu yiṁta sāladā
(||ĕṭṭa||)
kŏmma nīse nādam̐ ḍaṁta kobānam̐ baḍĕnemi
tammibuvvu vāḍu nŏvvam̐dāginanemi
amma nī vavvalimŏgamainā nādanigemi
immula yĕduḍa nunnām̐ ḍiṁtasāladā
(||ĕṭṭa||)
maguva nī kadanido māḍāḍagunna nemi
nŏgili yādam̐ḍu nīse nŏchchina nemi
mŏgamīga nīvĕṁta movam̐ga nāḍinanemi
nagagunnam̐ gannulane navvu sāladā
(||ĕṭṭa||)
ādi gŏni nī vadani kaḍḍamu lāḍinanemi
vedanala nippuḍĕṁta vem̐sina nemi
ādariṁche veṁkaḍeśhum̐ ḍalamelumaṁganāsā-
rīdĕsam̐ biluvumanī niṁtasāladā