ఎఱుఁగుకోవే నీ యెమ్మెలు చాలు
(॥పల్లవి॥)
ఎఱుఁగుకోవే నీ యెమ్మెలు చాలు
మఱి యిఁక దూరకువే మగఁడు నా పాలు
(॥ఇవిఁ॥)
పలుమారుఁ జూపకువే పంతాలు
వెలయనింతేఁటికి వేసాలు
పెలుచవై యాడకువే బింకాలు
చెలువుఁ డిన్నిటా నాకుఁ జేసినాఁడే మేలు
(॥ఇవిఁ॥)
ఆయనాయఁ జెప్పకువే అందాలు
పాయనాతని నేను పగలు రేలు
నీయందుఁ గంటిమే కడునేమాలు
యీయెడఁ బెట్టె నా కాఁత డిదె సేసపాలు
(॥ఇవిఁ॥)
చేసె నాకుఁ జూడవే సింగారాలు
వాసులు నెరపకువే వట్టి మాయలు
బాసతో నలమేత్మంగపతి శ్రీ వేంకటేశుడు
మోసపోక నన్ను నేలె మోహాన కిదె కీలు
(||pallavi||)
ĕṟum̐gugove nī yĕmmĕlu sālu
maṟi yim̐ka dūraguve magam̐ḍu nā pālu
(||ivim̐||)
palumārum̐ jūbaguve paṁtālu
vĕlayaniṁtem̐ṭigi vesālu
pĕlusavai yāḍaguve biṁkālu
sĕluvum̐ ḍinniḍā nāgum̐ jesinām̐ḍe melu
(||ivim̐||)
āyanāyam̐ jĕppaguve aṁdālu
pāyanādani nenu pagalu relu
nīyaṁdum̐ gaṁṭime kaḍunemālu
yīyĕḍam̐ bĕṭṭĕ nā kām̐ta ḍidĕ sesabālu
(||ivim̐||)
sesĕ nāgum̐ jūḍave siṁgārālu
vāsulu nĕrabaguve vaṭṭi māyalu
bāsado nalametmaṁgabadi śhrī veṁkaḍeśhuḍu
mosaboga nannu nelĕ mohāna kidĕ kīlu