Eṟumgudum dana suddu linniyum dolle nenu

ఎఱుఁగుదుఁ దన సుద్దు లిన్నియుఁ దొల్లె నేను
Language

(॥పల్లవి॥)
ఎఱుఁగుదుఁ దన సుద్దు లిన్నియుఁ దొల్లె నేను
తఱచాయ ముచ్చటలు తలఁచుకొమ్మనవే

(॥ఎఱుఁ॥)
ననుపులు నిజమైతే నవ్వులు సేనాసేన
మనసు లెనసితేను మాఁటలు పెక్కు
వినయము నెరిచితే వెలయు సంగాతము
తనతో నెదురాడేనా దగ్గరి రమ్మనవే

(॥ఎఱుఁ॥)
చూపులు నాఁటఁ జూచితే చొక్కులు కోటానఁగోటి
వోపికలు గలిగితే వొడి నిండును
కాఁపురాలు సతమైతే కైవసమౌ వలపులు
యే పనులు చెప్పినాను ఇయ్యకొంటి ననవే

(॥ఎఱుఁ॥)
సరసము లొనరితే చనవులు చెల్లుబడౌ
సరవులు చక్కనైతే చవులు వుట్టు
ఇరవై శ్రీవేంకటేశుఁ డిప్పుడు వచ్చి నన్నేలె
మరిగితి నిట్లనే మన్నించు మనవే

(||pallavi||)
ĕṟum̐gudum̐ dana suddu linniyum̐ dŏllĕ nenu
taṟasāya muchchaḍalu talam̐sugŏmmanave

(||ĕṟum̐||)
nanubulu nijamaide navvulu senāsena
manasu lĕnasidenu mām̐ṭalu pĕkku
vinayamu nĕriside vĕlayu saṁgādamu
tanado nĕdurāḍenā daggari rammanave

(||ĕṟum̐||)
sūbulu nām̐ṭam̐ jūside sŏkkulu koḍānam̐goḍi
vobigalu galigide vŏḍi niṁḍunu
kām̐purālu sadamaide kaivasamau valabulu
ye panulu sĕppinānu iyyagŏṁṭi nanave

(||ĕṟum̐||)
sarasamu lŏnaride sanavulu sĕllubaḍau
saravulu sakkanaide savulu vuṭṭu
iravai śhrīveṁkaḍeśhum̐ ḍippuḍu vachchi nannelĕ
marigidi niṭlane manniṁchu manave