ఎఱుఁగుదుఁ దన సుద్దు లిన్నియు నేను
(॥పల్లవి॥)
ఎఱుఁగుదుఁ దన సుద్దు లిన్నియు నేను
గుఱుతులెల్లాఁ దెలిపె కోరి చూడుమనవే
(॥ఎఱుఁ॥)
యెంచినవే యెంచితేను యెడతెగవు లెక్కలు
పొంచి యెందాఁకా నాతోఁ బొద్దు వుచ్చీనే
కొంచి దవ్వులఁ జూచితే కొండలు నున్ననైయుండు
వంచెనతో మొక్కెఁగాని వచ్చితే రమ్మనవే
(॥ఎఱుఁ॥)
చెప్పినవే చెప్పితేను సేనలౌను మాటలు
చిప్పిల నన్నెంత తాను చిమ్మిరేఁచీనే
వుప్ప గప్పరమువలె నుండు పరికించితేను
తిప్పరాదు తనయాస తెమ్మనవే విడెము
(॥ఎఱుఁ॥)
సేసినవే సేసితేను చేతికిఁ జిక్కఁ బనులు
వేసటలేక యెంత వెడ్డు వెట్టీనే
సేసవెట్టి నన్ను నేలె శ్రీవేంకటేశుఁడు తాను
మూసిన ముత్తెమై యుండె మోవి నాకిమ్మనవే
(||pallavi||)
ĕṟum̐gudum̐ dana suddu linniyu nenu
guṟudulĕllām̐ dĕlibĕ kori sūḍumanave
(||ĕṟum̐||)
yĕṁchinave yĕṁchidenu yĕḍadĕgavu lĕkkalu
pŏṁchi yĕṁdām̐kā nādom̐ bŏddu vuchchīne
kŏṁchi davvulam̐ jūside kŏṁḍalu nunnanaiyuṁḍu
vaṁchĕnado mŏkkĕm̐gāni vachchide rammanave
(||ĕṟum̐||)
sĕppinave sĕppidenu senalaunu māḍalu
sippila nannĕṁta tānu simmirem̐sīne
vuppa gapparamuvalĕ nuṁḍu parigiṁchidenu
tipparādu tanayāsa tĕmmanave viḍĕmu
(||ĕṟum̐||)
sesinave sesidenu sedigim̐ jikkam̐ banulu
vesaḍalega yĕṁta vĕḍḍu vĕṭṭīne
sesavĕṭṭi nannu nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu tānu
mūsina muttĕmai yuṁḍĕ movi nāgimmanave