ఎఱుఁగుదు రందరును యేల దాచేవు మోహము
(॥పల్లవి॥)
ఎఱుఁగుదు రందరును యేల దాచేవు మోహము
వెఱపేల ఇఁకఁ దెర వేసుకోరాదా
(॥ఎఱు॥)
ననువునఁ జవరాలు నాఁటఁగంజూచినచూపు
తనివోనినీకుఁ బైతరవాయను
మొనగోరి చేతుల మొక్కినమొక్కులు నేఁడు
యెనలేనివలపుల కెచ్చరికకలాయను
(॥ఎఱు॥)
సొరిది నప్పటి నాపె సొలసి యాడినమాట
మరిగించేమచ్చుమేపుమందాయను
సిరులుమించినయట్టిసెలవులనవ్వులు
బెరయనిరతులకుఁ బెడరేఁపులాయను
(॥ఎఱు॥)
యిట్టె నీదేవులు చేతికిచ్చినయీకానుక
జట్టిగాన్నకాఁగిలే లంచములాయను
నెట్టన శ్రీవేంకటేశ నెమ్మి నీకె నేలితివి
చుట్టరికము లివియే సులభములాయను
(||pallavi||)
ĕṟum̐gudu raṁdarunu yela dāsevu mohamu
vĕṟabela im̐kam̐ dĕra vesugorādā
(||ĕṟu||)
nanuvunam̐ javarālu nām̐ṭam̐gaṁjūsinasūbu
tanivoninīgum̐ baidaravāyanu
mŏnagori sedula mŏkkinamŏkkulu nem̐ḍu
yĕnalenivalabula kĕchcharigagalāyanu
(||ĕṟu||)
sŏridi nappaḍi nābĕ sŏlasi yāḍinamāḍa
marigiṁchemachchumebumaṁdāyanu
sirulumiṁchinayaṭṭisĕlavulanavvulu
bĕrayaniradulagum̐ bĕḍarem̐pulāyanu
(||ĕṟu||)
yiṭṭĕ nīdevulu sedigichchinayīgānuga
jaṭṭigānnagām̐gile laṁchamulāyanu
nĕṭṭana śhrīveṁkaḍeśha nĕmmi nīgĕ nelidivi
suṭṭarigamu liviye sulabhamulāyanu