Eṟumgudu nee manasu yela daamsevu

ఎఱుఁగుదు నీ మనసు యేల దాఁచేవు
Language

(॥పల్లవి॥)
ఎఱుఁగుదు నీ మనసు యేల దాఁచేవు
మెఱసి యాపె నీకు మేలుదిగాదా

(॥ఎఱుఁ॥)
చూపెట్టుక నాతో మరి సుద్దులు చెప్పేవుగాని
ఆపెతో నిపుడు మాఁటలాడి రారాదా
యేపున మాపటంత మాయింటికి వత్తువుగాని
యేపొద్దాడకుఁ బోఇ నీ విట్టె రారాదా

(॥ఎఱుఁ॥)
పైకొని ఇచ్చోట నాకు బాగా లిచ్చేవుగాని
ఆకెను ననుసరించి యట్టె రారాదా
వాకుచ్చి నా చెలువము వదలకెంతవుగాని
జోకతోడ నాపె మోము చూచి రారాదా

(॥ఎఱుఁ॥)
యెడయక నన్ను నేఁడే యేలేవుగాని ఇంతలో
నడుమ నాపెతోఁ గొంత నవ్వి రారాదా
కడఁగి శ్రీవేంకటేశ కాఁగిలించి తయ్యీఁగాని
చిడుముడి నాపెతోడాఁ జెప్పి రారాదా

(||pallavi||)
ĕṟum̐gudu nī manasu yela dām̐sevu
mĕṟasi yābĕ nīgu meludigādā

(||ĕṟum̐||)
sūbĕṭṭuga nādo mari suddulu sĕppevugāni
ābĕdo nibuḍu mām̐ṭalāḍi rārādā
yebuna mābaḍaṁta māyiṁṭigi vattuvugāni
yebŏddāḍagum̐ boi nī viṭṭĕ rārādā

(||ĕṟum̐||)
paigŏni ichchoḍa nāgu bāgā lichchevugāni
āgĕnu nanusariṁchi yaṭṭĕ rārādā
vāguchchi nā sĕluvamu vadalagĕṁtavugāni
jogadoḍa nābĕ momu sūsi rārādā

(||ĕṟum̐||)
yĕḍayaga nannu nem̐ḍe yelevugāni iṁtalo
naḍuma nābĕdom̐ gŏṁta navvi rārādā
kaḍam̐gi śhrīveṁkaḍeśha kām̐giliṁchi tayyīm̐gāni
siḍumuḍi nābĕdoḍām̐ jĕppi rārādā