(॥పల్లవి॥)
ఎఱుకమాలినదాని నేమనేది
అఱమఱలేక నీవు నందె కూడుకొంటివి
(॥ఎఱు॥)
చన్నులపైఁ బయ్యర చక్కఁబెట్టుకొంటాను
సన్నలనే మాటలాడీ సతి నీతోను
యెన్ని నేర్చె వెడమాయలివి నీకుఁ బ్రియమాయ
కన్నవారెల్లా నవ్వేది కటకటా చూడదు
(॥ఎఱు॥)
మలయుచుఁ బుక్కిటి తములము మారుచుకొంటా
సెలవుల నవ్వు నవ్వీఁ జెలి నీతోను
నిలువెల్లా వేసాలే నీవందుకు భ్రమతువు
చెలులు గేలిగొనేది చెల్లఁబో యెరఁగదు
(॥ఎఱు॥)
వాఁడినకెమ్మోవి తేనెవాసనలు చల్లుకొంటా
కూడీని శ్రీ వేంకటేశ కొమ్మ నీతోను
జాడలీపె విట్లానే; సరి నన్ను నేలితివి
ఆడవారు సంతోసించే దయ్యయ్యో తా మెచ్చదు
(||pallavi||)
ĕṟugamālinadāni nemanedi
aṟamaṟalega nīvu naṁdĕ kūḍugŏṁṭivi
(||ĕṟu||)
sannulabaim̐ bayyara sakkam̐bĕṭṭugŏṁṭānu
sannalane māḍalāḍī sadi nīdonu
yĕnni nersĕ vĕḍamāyalivi nīgum̐ briyamāya
kannavārĕllā navvedi kaḍagaḍā sūḍadu
(||ĕṟu||)
malayusum̐ bukkiḍi tamulamu mārusugŏṁṭā
sĕlavula navvu navvīm̐ jĕli nīdonu
niluvĕllā vesāle nīvaṁdugu bhramaduvu
sĕlulu geligŏnedi sĕllam̐bo yĕram̐gadu
(||ĕṟu||)
vām̐ḍinagĕmmovi tenĕvāsanalu sallugŏṁṭā
kūḍīni śhrī veṁkaḍeśha kŏmma nīdonu
jāḍalībĕ viṭlāne; sari nannu nelidivi
āḍavāru saṁtosiṁche dayyayyo tā mĕchchadu