ఎఱుక గలవాఁడవు ఇన్నిటా నీవు
(॥పల్లవి॥)
ఎఱుక గలవాఁడవు ఇన్నిటా నీవు
తఱితోడ గారవించి దయఁజూడరాదా
(॥ఎఱు॥)
చెలియ చెక్కలఁ గారే చెమట దుడువవయ్య
అలరి సురటివీచి యలసినది
కలువలకొప్ప జారీ కాంతకు ముడువవయ్య
సెలవుల నవ్వి నవ్వి చీకాకయినది
(॥ఎఱు॥)
తరుణి మోవి వాడె తములమొసఁగవయ్య
పొరిఁ గత చెప్పి దప్పిఁ బొరలినది
సరు నురానఁ జెదరీ చక్కఁబెట్ట గదవయ్య
సరుగనఁ బాదాలొత్తి సదమదమైనది
(॥ఎఱు॥)
ఇంతి చన్నులపై కొంగు యెడలెను కప్పవయ్య
ఇందవడి నీరతుల నెనసినది
పంతపు శ్రీ వేంకటేశ పాయక కూడుండవయ్య
సంతోసాన నీపె నీకు చాలా వలచినది
(||pallavi||)
ĕṟuga galavām̐ḍavu inniḍā nīvu
taṟidoḍa gāraviṁchi dayam̐jūḍarādā
(||ĕṟu||)
sĕliya sĕkkalam̐ gāre sĕmaḍa duḍuvavayya
alari suraḍivīsi yalasinadi
kaluvalagŏppa jārī kāṁtagu muḍuvavayya
sĕlavula navvi navvi sīgāgayinadi
(||ĕṟu||)
taruṇi movi vāḍĕ tamulamŏsam̐gavayya
pŏrim̐ gada sĕppi dappim̐ bŏralinadi
saru nurānam̐ jĕdarī sakkam̐bĕṭṭa gadavayya
saruganam̐ bādālŏtti sadamadamainadi
(||ĕṟu||)
iṁti sannulabai kŏṁgu yĕḍalĕnu kappavayya
iṁdavaḍi nīradula nĕnasinadi
paṁtabu śhrī veṁkaḍeśha pāyaga kūḍuṁḍavayya
saṁtosāna nībĕ nīgu sālā valasinadi