Erubarasagaraavu yevvarisommulo yivi

ఏరుపరచగరావు యెవ్వరిసొమ్ములో యివి
Language

(॥పల్లవి॥)
ఏరుపరచగరావు యెవ్వరిసొమ్ములో యివి
చేరి నిన్ను నడిగేము చెప్పవయ్య తగవు

(॥ఏరు॥)
అలులు నరచంద్రుడు నతనుని విండ్లును
కలువలు సంపెఁగయుఁ గమ్మఁజిగురు
పలుచనియద్దములు పచ్చిపోఁకయు శ్రీలు
చెలియసింగారాలో చిత్తజునిపౌఁజులో

(॥ఏరు॥)
తిన్ననిసంక్కును మంచితీగెలునుఁ దామరలు
చిన్నిజక్కవ పిల్లలు సింహమును
యెన్నరావిచిమతరి ఇసుకదిబ్బలును
కన్నెసింగారాలో ఇవి కామునిబలములో

(॥ఏరు॥)
అనటికంబములును అమ్ములపొదులును
మినుకుఁగూర్మములు మించువ జ్రాలు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
వనితసింగారాలో వలరాజుమూకలో

(||pallavi||)
erubarasagarāvu yĕvvarisŏmmulo yivi
seri ninnu naḍigemu sĕppavayya tagavu

(||eru||)
alulu narasaṁdruḍu nadanuni viṁḍlunu
kaluvalu saṁpĕm̐gayum̐ gammam̐jiguru
palusaniyaddamulu pachchibom̐kayu śhrīlu
sĕliyasiṁgārālo sittajunibaum̐julo

(||eru||)
tinnanisaṁkkunu maṁchidīgĕlunum̐ dāmaralu
sinnijakkava pillalu siṁhamunu
yĕnnarāvisimadari isugadibbalunu
kannĕsiṁgārālo ivi kāmunibalamulo

(||eru||)
anaḍigaṁbamulunu ammulabŏdulunu
minugum̐gūrmamulu miṁchuva jrālu
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
vanidasiṁgārālo valarājumūgalo