ఎరవు సేయ దెంతైనా నిన్నిటా నీదేవులు
(॥పల్లవి॥)
ఎరవు సేయ దెంతైనా నిన్నిటా నీదేవులు
పొరసి యీ గుణాలతోఁ బొగడొందుఁ గాని
(॥ఎర॥)
వేడకకత్తైనది వేసారదు పతిపైని
జాడతో వలపులు చల్లుఁగాని
వాడిక గలిగినది వంతువాసు లెంచదు
కూడిమాడి కూరిములు కొసరుఁగాని
(॥ఎర॥)
తగులాయమైనది తనియ దెంతైనాను
జిగిమించ నితవులే సేసుఁగాని
మిగులాఁ జుట్టమైనది మీరి పలుక దెప్పడు
పగటున నోరుపులే పచరించుఁగాని
(॥ఎర॥)
ఆసకురాలైన ది అలయదు రతులను
పాసి తొలఁగ దెప్పడు పైకొనుఁగాని
సేసతో నిల్లాలైనది శ్రీవేంకటేశుఁడ నీకు
రాసికెక్క నిట్టె కాఁపురము సేయుఁగాని
(||pallavi||)
ĕravu seya dĕṁtainā ninniḍā nīdevulu
pŏrasi yī guṇāladom̐ bŏgaḍŏṁdum̐ gāni
(||ĕra||)
veḍagakattainadi vesāradu padibaini
jāḍado valabulu sallum̐gāni
vāḍiga galiginadi vaṁtuvāsu lĕṁchadu
kūḍimāḍi kūrimulu kŏsarum̐gāni
(||ĕra||)
tagulāyamainadi taniya dĕṁtainānu
jigimiṁcha nidavule sesum̐gāni
migulām̐ juṭṭamainadi mīri paluga dĕppaḍu
pagaḍuna norubule pasariṁchum̐gāni
(||ĕra||)
āsagurālaina di alayadu radulanu
pāsi tŏlam̐ga dĕppaḍu paigŏnum̐gāni
sesado nillālainadi śhrīveṁkaḍeśhum̐ḍa nīgu
rāsigĕkka niṭṭĕ kām̐puramu seyum̐gāni