Eṟamgavu naa manasu yettidaudaa nimkaanu

ఎఱఁగవు నా మనసు యెట్టిదౌతా నింకాను
Language

(॥పల్లవి॥)
ఎఱఁగవు నా మనసు యెట్టిదౌతా నింకాను
తెఱవ నింతే నీతో దీకొనేనా

(॥ఎఱఁ॥)
వేసాలో నిజమో వేఁడుకొనే విటు నన్ను
ఆసపడేదాన నీతో నలిగేనా
పాసివున్నవాఁడవై పలుమారూఁబొదిగేవు
వీసమంత పనికిఁగా విసిగేనా

(॥ఎఱఁ॥)
చలమో బత్తిగలిగో చాఁచేవు నాపయిఁజేయి
వలచినదాన నేను వద్దనేనా
యెలయించినవాఁడవై యిచ్చకాలు సేసేవు
పెలుచుఁ బనికిఁగాను బిగిసేనా

(॥ఎఱఁ॥)
నగవులో తగవుల నన్ను నిట్టె కూడితివి
మొగమోటదాన నేను మొఱఁగేనా
పొగరు శ్రీ వేంకటేశ బొంకి యాన వెట్టేవు
తగిన పనికిఁగాను తమకించేన

(||pallavi||)
ĕṟam̐gavu nā manasu yĕṭṭidaudā niṁkānu
tĕṟava niṁte nīdo dīgŏnenā

(||ĕṟam̐||)
vesālo nijamo vem̐ḍugŏne viḍu nannu
āsabaḍedāna nīdo naligenā
pāsivunnavām̐ḍavai palumārūm̐bŏdigevu
vīsamaṁta panigim̐gā visigenā

(||ĕṟam̐||)
salamo battigaligo sām̐sevu nābayim̐jeyi
valasinadāna nenu vaddanenā
yĕlayiṁchinavām̐ḍavai yichchagālu sesevu
pĕlusum̐ banigim̐gānu bigisenā

(||ĕṟam̐||)
nagavulo tagavula nannu niṭṭĕ kūḍidivi
mŏgamoḍadāna nenu mŏṟam̐genā
pŏgaru śhrī veṁkaḍeśha bŏṁki yāna vĕṭṭevu
tagina panigim̐gānu tamagiṁchena