ఎఱఁగవచ్చెనే నేఁడు యెమ్మెలెల్లాను
(॥పల్లవి॥)
ఎఱఁగవచ్చెనే నేఁడు యెమ్మెలెల్లాను
తఱియాయ విభుని పాదము లొత్తఁగదవే
(॥ఎఱఁ॥)
చలపాది తనమైతే సంగడిఁ గూచుండనేల
తలఁపు మానలేని కాఁతాళము గాక
అలుకే నిజమైతే అసలు చూపఁగనేల
కలిగి వలపుల గతులు గాక
(॥ఎఱఁ॥)
కోపమే కలిగితేను కొసరు మాటాడనేల
రూపులేని కోరికలరుచులు గాక
రాఁపుల మచ్చరమైతే రమ్మని పిలువనేల
ఆఁపరాని తమకపుటలమట గాక
(॥ఎఱఁ॥)
సిగ్గులే నిజమైతే సేవలు సేయఁగనేల
అగ్గలపురతుల చయ్యాటము గాక
యెగ్గులేక శ్రీవేంకటేశుఁ డెట్టె నిన్ను నేలె
బగ్గన నిదెల్లా నీ భాగ్యమే కాక
(||pallavi||)
ĕṟam̐gavachchĕne nem̐ḍu yĕmmĕlĕllānu
taṟiyāya vibhuni pādamu lŏttam̐gadave
(||ĕṟam̐||)
salabādi tanamaide saṁgaḍim̐ gūsuṁḍanela
talam̐pu mānaleni kām̐tāḽamu gāga
aluge nijamaide asalu sūbam̐ganela
kaligi valabula gadulu gāga
(||ĕṟam̐||)
kobame kaligidenu kŏsaru māḍāḍanela
rūbuleni korigalarusulu gāga
rām̐pula machcharamaide rammani piluvanela
ām̐parāni tamagabuḍalamaḍa gāga
(||ĕṟam̐||)
siggule nijamaide sevalu seyam̐ganela
aggalaburadula sayyāḍamu gāga
yĕggulega śhrīveṁkaḍeśhum̐ ḍĕṭṭĕ ninnu nelĕ
baggana nidĕllā nī bhāgyame kāga