ఎఱఁగవా నీవేమైనా ఇన్నిటా జాణఁడవు
(॥పల్లవి॥)
ఎఱఁగవా నీవేమైనా ఇన్నిటా జాణఁడవు
మ(మె?)ఱసి మీ మహిమలు మెచ్చుకొంటగాక
(॥ఎఱఁ॥)
వలపు దలకెక్కితే వారించేవా రెవ్వరు
మలసి మోవితేనెలే మందులౌఁగాక
తలఁపే చీఁకటిగొంటే తగదన నెట్టువచ్చు
తెలినవ్వు వెన్నెలచే తేటవారుఁగాక
(॥ఎఱఁ॥)
విరహమే వేఁడైతే విడిపించ వెరవేది
సరససల్లాపములే చలువౌఁగాక
వొరపులే తరమైతే వొడ్డుకొనే దెటువలె
అరిది రతుల నోలలాడుత(ట?) గాక
(॥ఎఱఁ॥)
పాయమే మరిగించితే బడివాయ నెపమేది
కాయజకేలి కాఁగిలే గతిగాక
యీయెడ శ్రీవేంకటేశ యీకె నీవుఁ గూడితిరి
పాయని సంతోసాలఁబరగుట గాక
(||pallavi||)
ĕṟam̐gavā nīvemainā inniḍā jāṇam̐ḍavu
ma(mĕ?)ṟasi mī mahimalu mĕchchugŏṁṭagāga
(||ĕṟam̐||)
valabu dalagĕkkide vāriṁchevā rĕvvaru
malasi movidenĕle maṁdulaum̐gāga
talam̐pe sīm̐kaḍigŏṁṭe tagadana nĕṭṭuvachchu
tĕlinavvu vĕnnĕlase teḍavārum̐gāga
(||ĕṟam̐||)
virahame vem̐ḍaide viḍibiṁcha vĕravedi
sarasasallābamule saluvaum̐gāga
vŏrabule taramaide vŏḍḍugŏne dĕḍuvalĕ
aridi radula nolalāḍuda(ṭa?) gāga
(||ĕṟam̐||)
pāyame marigiṁchide baḍivāya nĕbamedi
kāyajageli kām̐gile gadigāga
yīyĕḍa śhrīveṁkaḍeśha yīgĕ nīvum̐ gūḍidiri
pāyani saṁtosālam̐baraguḍa gāga