Eṟamgavaa aabe maagu neligasaani yauda

ఎఱఁగవా ఆపె మాకు నేలికసాని యౌత
Language

(॥పల్లవి॥)
ఎఱఁగవా ఆపె మాకు నేలికసాని యౌత
గుఱిసేసి నన్ను నేల గుట్టుతో మెచ్చేవే

(॥ఎఱఁ॥)
సేసవెట్టి పెండ్లాడినచెలి గాచుకుండఁగాను
ఆసగించే వదేమే నీ వాతనికిని
మోసపోక తమలోన మొగములు చూచుకోఁగా
లాసి లాసి నీవెంత వలపు చల్లేవే

(॥ఎఱఁ॥)
మేనమఱఁదలయిన మెలుఁత దండ నుండఁగా
నానఁ బెట్టుక నీవేమి నవ్వు నవ్వేవే
పానుపున నిద్దురూ పవళించియుండఁగాను
పూని పట్టి నీ వెట్టు పొంచి మాఁటలాడేవే

(॥ఎఱఁ॥)
పట్టపుదేవు లయిన భామ సతమై యుండఁగా
వెట్టికి నీవేల వచ్చి వీడె మిచ్చేవే
అట్టె శ్రీవేంకటేశుఁడూ నాపె సన్నసేసుకోఁగా
పొట్టఁ బొరుగు నీవేమి పొత్తు గలసేవే

(||pallavi||)
ĕṟam̐gavā ābĕ māgu neligasāni yauda
guṟisesi nannu nela guṭṭudo mĕchcheve

(||ĕṟam̐||)
sesavĕṭṭi pĕṁḍlāḍinasĕli gāsuguṁḍam̐gānu
āsagiṁche vademe nī vādanigini
mosaboga tamalona mŏgamulu sūsugom̐gā
lāsi lāsi nīvĕṁta valabu salleve

(||ĕṟam̐||)
menamaṟam̐dalayina mĕlum̐ta daṁḍa nuṁḍam̐gā
nānam̐ bĕṭṭuga nīvemi navvu navveve
pānubuna niddurū pavaḽiṁchiyuṁḍam̐gānu
pūni paṭṭi nī vĕṭṭu pŏṁchi mām̐ṭalāḍeve

(||ĕṟam̐||)
paṭṭabudevu layina bhāma sadamai yuṁḍam̐gā
vĕṭṭigi nīvela vachchi vīḍĕ michcheve
aṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍū nābĕ sannasesugom̐gā
pŏṭṭam̐ bŏrugu nīvemi pŏttu galaseve