ఎఱఁగనంటా నానలేల పెట్టుకొనే వీడ
(॥పల్లవి॥)
ఎఱఁగనంటా నానలేల పెట్టుకొనే వీడ
యెఱిఁగేవుగాక ఇక నెందువొయ్యేవయ్యా
(॥ఎఱ॥)
మనసు మర్మమెఱుఁగు మాటలు వాసులెఱుగు
తనువు కాఁగిటిలోనితమి యెఱుఁగు
పనివడి నీవెంత పరాకుతో నుండినాను
యెనసేవుగాక మమ్ము నెందు వొయ్యేవయ్యా
(॥ఎఱ॥)
వలపు తెగులెఱుఁగు వయసు వాడికెఱఁగు
చెలునపుపంతములు సిగ్గెఱుఁగును
నిలువురాజసముతో నీవెంత వుండినాను
యెలమి మన్నించేవుగా కెందువొయ్యేవయ్యా
(॥ఎఱ॥)
కన్నులు కాంక్ష లెఱుఁగు కందువలు గోళ్లెఱఁగు
సన్నపునవ్వులు మోవి సారె నెఱుఁగు
అన్నిటా శ్రీవేంకటేశ అలమేలుమంగను నేను
యెన్నికఁ గూడితి విఁక నెందువొయ్యేవయ్యా
(||pallavi||)
ĕṟam̐ganaṁṭā nānalela pĕṭṭugŏne vīḍa
yĕṟim̐gevugāga iga nĕṁduvŏyyevayyā
(||ĕṟa||)
manasu marmamĕṟum̐gu māḍalu vāsulĕṟugu
tanuvu kām̐giḍilonidami yĕṟum̐gu
panivaḍi nīvĕṁta parāgudo nuṁḍinānu
yĕnasevugāga mammu nĕṁdu vŏyyevayyā
(||ĕṟa||)
valabu tĕgulĕṟum̐gu vayasu vāḍigĕṟam̐gu
sĕlunabubaṁtamulu siggĕṟum̐gunu
niluvurājasamudo nīvĕṁta vuṁḍinānu
yĕlami manniṁchevugā kĕṁduvŏyyevayyā
(||ĕṟa||)
kannulu kāṁkṣha lĕṟum̐gu kaṁduvalu goḽlĕṟam̐gu
sannabunavvulu movi sārĕ nĕṟum̐gu
anniḍā śhrīveṁkaḍeśha alamelumaṁganu nenu
yĕnnigam̐ gūḍidi vim̐ka nĕṁduvŏyyevayyā