ఎఱఁగనా నీ సుద్దులు ఇప్పడు మా ఇంట వచ్చి
(॥పల్లవి॥)
ఎఱఁగనా నీ సుద్దులు ఇప్పడు మా ఇంట వచ్చి
మెఱయుచు నన్ను నేలి మెప్పించితివి గాక
(॥ఎఱఁ॥)
యెవ్వతో మేడెక్కియుండి, యేనుఁగపై నీవు రాఁగా
అవ్వేళ చేయిచ్చి నిన్ను నందుకొనెను
వువ్విళ్లూరె మీలోని వొద్దిక లప్పడు చూచి
జవ్వనులు మెచ్చి మెచ్చి సంతోసించుకొనిరి
(॥ఎఱఁ॥)
తురగము నట్టె నీవు తోలఁగా మానిపైనుండి
విరులుగోసేలేమ నీవెనక నెక్కె
సరుగన మీ ఇద్దరి చందాలు పక్కనఁ జూచి
సరసిజాక్షులు నవ్వి జాణలౌదు రనిరి
(॥ఎఱఁ॥)
నిగిడి పల్లకిమీఁద నీవు రాఁగాఁ బన్నాగము
దిగవేసి తనింటికిఁ దెచ్చె నొకతె
తగ శ్రీవేంకటేశ కాంతల నీపొందులు చూచి
మగువలందరు మిమ్ము మచ్చికఁ బొగడిరి
(||pallavi||)
ĕṟam̐ganā nī suddulu ippaḍu mā iṁṭa vachchi
mĕṟayusu nannu neli mĕppiṁchidivi gāga
(||ĕṟam̐||)
yĕvvado meḍĕkkiyuṁḍi, yenum̐gabai nīvu rām̐gā
avveḽa seyichchi ninnu naṁdugŏnĕnu
vuvviḽlūrĕ mīloni vŏddiga lappaḍu sūsi
javvanulu mĕchchi mĕchchi saṁtosiṁchugŏniri
(||ĕṟam̐||)
turagamu naṭṭĕ nīvu tolam̐gā mānibainuṁḍi
virulugoselema nīvĕnaga nĕkkĕ
sarugana mī iddari saṁdālu pakkanam̐ jūsi
sarasijākṣhulu navvi jāṇalaudu raniri
(||ĕṟam̐||)
nigiḍi pallagimīm̐da nīvu rām̐gām̐ bannāgamu
digavesi taniṁṭigim̐ dĕchchĕ nŏgadĕ
taga śhrīveṁkaḍeśha kāṁtala nībŏṁdulu sūsi
maguvalaṁdaru mimmu machchigam̐ bŏgaḍiri