Eṟamgamu neesittamimka netlunnado

ఎఱఁగము నీచిత్తమిఁక నెట్లున్నదో
Language

(॥పల్లవి॥)
ఎఱఁగము నీచిత్తమిఁక నెట్లున్నదో
మఱియు నీయానతికి మారుకొనమయ్యా

(॥ఎఱఁ॥)
చలములు సారెకు సాదించువారికి
మలసి యేమనినా సమ్మతి గాదు
వలపులు పైపై వడిసేటివారికి
పిలిచినఁ గొండంతప్రియము గలుగును

(॥ఎఱఁ॥)
పంతములే కడుఁబచరించేవారికి
శాంత మించుకయుసమకొనదు
సంతపుఁబొందులు జరపెడివారికి
వింతగాఁ జూచినా వేడుక గలుగు

(॥ఎఱఁ॥)
ధరలో యెగ్గులుతప్పులవారికి
సరసపుఁజెనకులు చవిగావు
యిరవుగ శ్రీవేంకటేశ కూడితివి
అరయ మనల కింకా ఆసలే కలుగు

(||pallavi||)
ĕṟam̐gamu nīsittamim̐ka nĕṭlunnado
maṟiyu nīyānadigi mārugŏnamayyā

(||ĕṟam̐||)
salamulu sārĕgu sādiṁchuvārigi
malasi yemaninā sammadi gādu
valabulu paibai vaḍiseḍivārigi
pilisinam̐ gŏṁḍaṁtapriyamu galugunu

(||ĕṟam̐||)
paṁtamule kaḍum̐basariṁchevārigi
śhāṁta miṁchugayusamagŏnadu
saṁtabum̐bŏṁdulu jarabĕḍivārigi
viṁtagām̐ jūsinā veḍuga galugu

(||ĕṟam̐||)
dharalo yĕgguludappulavārigi
sarasabum̐jĕnagulu savigāvu
yiravuga śhrīveṁkaḍeśha kūḍidivi
araya manala kiṁkā āsale kalugu