Eṟamgamaa neegunaalu imdarilona

ఎఱఁగమా నీగుణాలు ఇందరిలోన
Language

(॥పల్లవి॥)
ఎఱఁగమా నీగుణాలు ఇందరిలోన
మఱవక మమ్ము నిట్టె మన్నించవయ్యా

(॥ఎఱఁ॥)
మంతనాన మాపుదాఁకా మాటలాడి తనియవు
యెంతలేదు నీయాసోద మేమి చెప్పేది
చెంతల గోర గీరినా సిగ్గులువడవు నీవు
ఇంతటి నీవాసిపట్టు యెంచఁగ నేమున్నది

(॥ఎఱఁ॥)
ననుపున నాతోను నవ్వు నవ్వి వేసారవు
పనిపూనినబిరుదుబంట వౌదువు
చెనకి యెంత దూరినా శిరసు వంచుకొనవు
పనుపడ నీపంతాలు పచారించనేఁటికి

(॥ఎఱఁ॥)
కడఁగి నన్నుఁ గూడి కాఁగిటిలో నలయవు
యెడయక నీనేర్పు లెట్టు మెచ్చేది
కడుఁబెనఁగినాను లోఁగవు శ్రీవేంకటేశ్వర
బడిబడి నీపొందు పాయ దెన్నటికి

(||pallavi||)
ĕṟam̐gamā nīguṇālu iṁdarilona
maṟavaga mammu niṭṭĕ manniṁchavayyā

(||ĕṟam̐||)
maṁtanāna mābudām̐kā māḍalāḍi taniyavu
yĕṁtaledu nīyāsoda memi sĕppedi
sĕṁtala gora gīrinā sigguluvaḍavu nīvu
iṁtaḍi nīvāsibaṭṭu yĕṁcham̐ga nemunnadi

(||ĕṟam̐||)
nanubuna nādonu navvu navvi vesāravu
panibūninabirudubaṁṭa vauduvu
sĕnagi yĕṁta dūrinā śhirasu vaṁchugŏnavu
panubaḍa nībaṁtālu pasāriṁchanem̐ṭigi

(||ĕṟam̐||)
kaḍam̐gi nannum̐ gūḍi kām̐giḍilo nalayavu
yĕḍayaga nīnerbu lĕṭṭu mĕchchedi
kaḍum̐bĕnam̐ginānu lom̐gavu śhrīveṁkaḍeśhvara
baḍibaḍi nībŏṁdu pāya dĕnnaḍigi