ఎఱఁగడు గాక తన్ను నిందరు నాడుకొనేది
(॥పల్లవి॥)
ఎఱఁగడు గాక తన్ను నిందరు నాడుకొనేది
తఱితో నామాఁట తానే తలఁచుకొమ్మనవే
(॥ఎఱఁ॥)
తగునా పొలుసు మేనఁ దట్టుపుళుగు
సొగయుబట్టతలకు చుట్టు తపారయేలే
అగడుసెలసుమోర కమరునా చిరునవ్వు
సగముమానిసికేలే చక్కదనాలు
(॥ఎఱఁ॥)
పుట్టుతిరిపేనకేలే భూషణములు
యిట్టె బ్రహ్మచారికేలే యింతులపొందు
నెట్టన యెంగిలీ నోఁట నిచ్చల ఘటనలేలే
తిట్టులఁబడేవానికి దీవనలేలే
(॥ఎఱఁ॥)
సిగ్గువిడిచినమీఁద చీర గట్టవలెనా
వెగ్గళమై గెరదాఁటే విచారమేలే
నిగ్గుల శ్రీవేంకటాద్రి నిలయుఁడు నన్నుఁ గూడె
యెగ్గులెల్లాఁ బాసె నిఁక యెడమాఁటలేలే
(||pallavi||)
ĕṟam̐gaḍu gāga tannu niṁdaru nāḍugŏnedi
taṟido nāmām̐ṭa tāne talam̐sugŏmmanave
(||ĕṟam̐||)
tagunā pŏlusu menam̐ daṭṭubuḽugu
sŏgayubaṭṭadalagu suṭṭu tabārayele
agaḍusĕlasumora kamarunā sirunavvu
sagamumānisigele sakkadanālu
(||ĕṟam̐||)
puṭṭudiribenagele bhūṣhaṇamulu
yiṭṭĕ brahmasārigele yiṁtulabŏṁdu
nĕṭṭana yĕṁgilī nom̐ṭa nichchala ghaḍanalele
tiṭṭulam̐baḍevānigi dīvanalele
(||ĕṟam̐||)
sigguviḍisinamīm̐da sīra gaṭṭavalĕnā
vĕggaḽamai gĕradām̐ṭe visāramele
niggula śhrīveṁkaḍādri nilayum̐ḍu nannum̐ gūḍĕ
yĕggulĕllām̐ bāsĕ nim̐ka yĕḍamām̐ṭalele