Eṟamga minnaallu nemu yiduvamti suddulu

ఎఱఁగ మిన్నాళ్లు నేము యిటువంటి సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ మిన్నాళ్లు నేము యిటువంటి సుద్దులు
గఱ గఱగా నేఁడు కానవచ్చె మాకును

(॥ఎఱఁ॥)
మంతనాన నిన్నుఁజేరి మాటలు సారెకు నాడీ
యెంతచన విచ్చితివో యీపెకు నీవు
సంతోసాలు రేఁచుకొంటా సరుసనే కూచున్నది
ఇంతికి నీకునుఁ జూడ నేనాటి పొందులో

(॥ఎఱఁ॥)
వరుస నీవూడిగాలవారికిఁ బనులు చెప్పీ
సిరులఁ బారుపత్య మిచ్చితివో నీవు
సరసములాడుకొంటా చల్లీ వలపులు నీపై
మరఁదలి వావి యెందు మరి తెచ్చుకొనెనో

(॥ఎఱఁ॥)
సెలవు నవ్వి నవ్వి చేతులు నీపైఁ జాఁచీ
సలిగె యెట్లిచ్చితివో చక్కఁగా నీవు
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కలసితి వీకె నెట్టు గలిగెనో నీకు

(||pallavi||)
ĕṟam̐ga minnāḽlu nemu yiḍuvaṁṭi suddulu
gaṟa gaṟagā nem̐ḍu kānavachchĕ māgunu

(||ĕṟam̐||)
maṁtanāna ninnum̐jeri māḍalu sārĕgu nāḍī
yĕṁtasana vichchidivo yībĕgu nīvu
saṁtosālu rem̐sugŏṁṭā sarusane kūsunnadi
iṁtigi nīgunum̐ jūḍa nenāḍi pŏṁdulo

(||ĕṟam̐||)
varusa nīvūḍigālavārigim̐ banulu sĕppī
sirulam̐ bārubatya michchidivo nīvu
sarasamulāḍugŏṁṭā sallī valabulu nībai
maram̐dali vāvi yĕṁdu mari tĕchchugŏnĕno

(||ĕṟam̐||)
sĕlavu navvi navvi sedulu nībaim̐ jām̐sī
saligĕ yĕṭlichchidivo sakkam̐gā nīvu
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kalasidi vīgĕ nĕṭṭu galigĕno nīgu