ఏరాలిఁ బొగడఁగా యేమీ ననము గాక
(॥పల్లవి॥)
ఏరాలిఁ బొగడఁగా యేమీ ననము గాక
మీ రింతేసి జాణలు మీకే తెలుసునే
(॥ఏరా॥)
జక్కవలు చన్నులట చందురుఁడు మోమట
వక్కణించి సింగారము వర్ఱించేదేమే
ముక్కు సంపంగిపువ్వట మొగిఁ గొప్పు తేఁటులట
మిక్కిలితగవరులు మీకే తెలుసులే
(॥ఏరా॥)
కరికుంభజగనట ఘన సింహమధ్యయట
ఇరవుగా నెరి గిది యెట్టు వోల్చేరే
సరిగురు లురులట చకోరాలు కన్నులట
మెరమెచ్చుమాటలు మీకే తెలుసులే
(॥ఏరా॥)
చేతులు తామరలట చెమట లేమంచట
యేతులకు బురుణించ నింత యేఁటికే
యీతల శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
మీతరుణి బాగులెల్లా మీకే తెలుసులే
(||pallavi||)
erālim̐ bŏgaḍam̐gā yemī nanamu gāga
mī riṁtesi jāṇalu mīge tĕlusune
(||erā||)
jakkavalu sannulaḍa saṁdurum̐ḍu momaḍa
vakkaṇiṁchi siṁgāramu varṟiṁchedeme
mukku saṁpaṁgibuvvaḍa mŏgim̐ gŏppu tem̐ṭulaḍa
mikkilidagavarulu mīge tĕlusule
(||erā||)
kariguṁbhajaganaḍa ghana siṁhamadhyayaḍa
iravugā nĕri gidi yĕṭṭu volsere
sariguru lurulaḍa sagorālu kannulaḍa
mĕramĕchchumāḍalu mīge tĕlusule
(||erā||)
sedulu tāmaralaḍa sĕmaḍa lemaṁchaḍa
yedulagu buruṇiṁcha niṁta yem̐ṭige
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
mīdaruṇi bāgulĕllā mīge tĕlusule