ఎప్పుడు మెచ్చేవోకాని యాకెను నీవు
(॥పల్లవి॥)
ఎప్పుడు మెచ్చేవోకాని యాకెను నీవు
చెప్పరాని గుట్టుతోడ చిమ్మి రేఁగీని
(॥ఎప్పు॥)
చెక్కిటికి మరఁగుగా చేయివెట్టుకొని యింతి
మక్కువలు చూపి నీతో మాఁటలాడీని
పక్కనఁ జన్నులమీఁదఁ బయ్యదఁగప్పుకొంటాను
మిక్కిలి సిగ్గులు నీమీఁదఁ జల్లీని
(॥ఎప్పు॥)
కన్నులు దేలించుకొంటా కానుకలు నీకిచ్చి
వెన్నెలపోగులుగాను వెస నవ్వీని
పన్నుకొన్న బిగువుతో పాపట దువ్వుకొంటాను
వున్నతి నీపొందులకు నూరకె లాచీని
(॥ఎప్పు॥)
పట్టరాని తమితోడ పాదమున వ్రాసుకొంటా
అట్టె నీకాఁగిటికి నాస సేసీని
నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి
పట్టుక తానిప్పుడే నీపాదా లొత్తీని
(||pallavi||)
ĕppuḍu mĕchchevogāni yāgĕnu nīvu
sĕpparāni guṭṭudoḍa simmi rem̐gīni
(||ĕppu||)
sĕkkiḍigi maram̐gugā seyivĕṭṭugŏni yiṁti
makkuvalu sūbi nīdo mām̐ṭalāḍīni
pakkanam̐ jannulamīm̐dam̐ bayyadam̐gappugŏṁṭānu
mikkili siggulu nīmīm̐dam̐ jallīni
(||ĕppu||)
kannulu deliṁchugŏṁṭā kānugalu nīgichchi
vĕnnĕlabogulugānu vĕsa navvīni
pannugŏnna biguvudo pābaḍa duvvugŏṁṭānu
vunnadi nībŏṁdulagu nūragĕ lāsīni
(||ĕppu||)
paṭṭarāni tamidoḍa pādamuna vrāsugŏṁṭā
aṭṭĕ nīgām̐giḍigi nāsa sesīni
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu nannu nelidivi
paṭṭuga tānippuḍe nībādā lŏttīni