Eppudoo oppugovadduraa odami

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
Work
Year
Language

పల్లవి:

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..
విశ్రమించవద్దు ఈ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..

చరణం 1:

నొప్పిలేని నిముషమేది.. జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే.. నిముషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణా
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను.. దీక్ష కన్న సారధెవరురా

నిరంతరం ప్రయత్నమున్నదా.. నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించు శక్తి ఏది.. నీకే నువ్వు బాసటైతే...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..

చరణం 2:

నింగి యెంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హుంకరిస్తే దిక్కులన్ని పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్ని అధికమించరా

దివిక్రమా పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమాపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా..

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..

pallavi:

ĕppuḍū ŏppugovaddurā oḍami..
ĕppuḍū vadulugovaddurā orimi..
viśhramiṁchavaddu ī kṣhaṇaṁ
vismariṁchavaddu nirṇayaṁ
appuḍe nī jayaṁ niśhchayaṁrā

ĕppuḍū ŏppugovaddurā oḍami..
ĕppuḍū vadulugovaddurā orimi..

saraṇaṁ 1:

nŏppileni nimuṣhamedi.. jananamaina maraṇamaina jīvidāna aḍugu aḍugunā
nīrasiṁchi nilisibode.. nimuṣhamaina nīdi kādu bradugu aṁṭe nitya gharṣhaṇā
dehamuṁdi prāṇamuṁdi nĕtturuṁdi sattuvuṁdi iṁtagannā sainyamuṁḍunā
āśha nīgu astramaunu śhvāsa nīgu śhastramaunu.. dīkṣha kanna sāradhĕvarurā

niraṁtaraṁ prayatnamunnadā.. nirāśhage nirāśha puṭṭadā
ninnu miṁchu śhakti edi.. nīge nuvvu bāsaḍaide...

ĕppuḍū ŏppugovaddurā oḍami..
ĕppuḍū vadulugovaddurā orimi..
viśhramiṁchavaddu e kṣhaṇaṁ
vismariṁchavaddu nirṇayaṁ
appuḍe nī jayaṁ niśhchayaṁrā

ĕppuḍū ŏppugovaddurā oḍami..
ĕppuḍū vadulugovaddurā orimi..

saraṇaṁ 2:

niṁgi yĕṁta gŏppadaina rivvumanna guvva pilla rĕkkamuṁdu takkuvenurā
saṁdramĕṁta pĕddadaina īdudunna seba pilla mŏppa muṁdu sinnadenurā
piḍugu vaṁṭi piḍigilĕtti urumuvallĕ huṁkariste dikkulanni pikkaḍillurā
āśhayāla aśhvamĕkki adubuleni kadanudŏkki avadhulanni adhigamiṁcharā

divikramā parākramiṁcharā viśhāla viśhvamākramiṁcharā
jaladhi saidamābaleni jvālavolĕ prajvaliṁcharā

ĕppuḍū ŏppugovaddurā oḍami..
ĕppuḍū vadulugovaddurā orimi..
viśhramiṁchavaddu e kṣhaṇaṁ
vismariṁchavaddu nirṇayaṁ
appuḍe nī jayaṁ niśhchayaṁrā..

ĕppuḍū ŏppugovaddurā oḍami..
ĕppuḍū vadulugovaddurā orimi..