Eppudoo naavaamdave yeṟumgudu ne naasuddi

ఎప్పుడూ నావాఁడవే యెఱుఁగుదు నే నాసుద్ది
Language

(॥పల్లవి॥)
ఎప్పుడూ నావాఁడవే యెఱుఁగుదు నే నాసుద్ది
చిప్పిల నన్ను నీవు చేపట్టి వదలవు

(॥ఎప్పు॥)
జంకించ నోపఁగాని సరసమాడే నీతో
మంకు చూపనోపఁ గాని మాటలాడేను
కొంకి వూరకుండనోపఁ గొసరిఁ జేతుల మొక్కే
సంకెలేక మోహించి యేసతిఁ దెచ్చుకొన్నాను

(॥ఎప్పు॥)
పంతములాడఁగాని పాదాలసేవ సేసేను
చింతతో నట్టగఁగాని చెక్కునొక్కేను
వింతగా మెలఁగఁగాని వేడుకచుట్టమ నయ్యే
వంతుకు నీ వేమగువవద్ద నుండినాను

(॥ఎప్పు॥)
తప్పులేమీ నెంచఁగాని తగిలి పొగడే నిన్ను
వుప్పతించఁగాని నీవొడి వట్టేను
ఇప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చొప్పులెత్తనేల నీ వేసుదతిఁ గూడినాను

(||pallavi||)
ĕppuḍū nāvām̐ḍave yĕṟum̐gudu ne nāsuddi
sippila nannu nīvu sebaṭṭi vadalavu

(||ĕppu||)
jaṁkiṁcha nobam̐gāni sarasamāḍe nīdo
maṁku sūbanobam̐ gāni māḍalāḍenu
kŏṁki vūraguṁḍanobam̐ gŏsarim̐ jedula mŏkke
saṁkĕlega mohiṁchi yesadim̐ dĕchchugŏnnānu

(||ĕppu||)
paṁtamulāḍam̐gāni pādālaseva sesenu
siṁtado naṭṭagam̐gāni sĕkkunŏkkenu
viṁtagā mĕlam̐gam̐gāni veḍugasuṭṭama nayye
vaṁtugu nī vemaguvavadda nuṁḍinānu

(||ĕppu||)
tappulemī nĕṁcham̐gāni tagili pŏgaḍe ninnu
vuppadiṁcham̐gāni nīvŏḍi vaṭṭenu
ippuḍe śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sŏppulĕttanela nī vesudadim̐ gūḍinānu