Eppudoo naabe neesomme yemdu voyeeni

ఎప్పుడూ నాపె నీసొమ్మె యెందు వోయీని
Language

(॥పల్లవి॥)
ఎప్పుడూ నాపె నీసొమ్మె యెందు వోయీని
చెప్పరాని వలపు నీచేతిలోనె కాదా

(॥ఎప్పు॥)
కన్నెనీతోఁ గోపగించి కదిసి మాటాడదంటా
యెన్ని ప్రియములు చెప్పే నెందాఁకాను
సన్నలదిట్టుదిట్టి చలము సాదించీనంటా
వన్ని యానలేల పెట్టి వంకిం(గిం?) చేవు

(॥ఎప్పు॥)
మంతనాన నాపె నీతో మాటలాడకున్నదంటా
సంతమేల ఇచ్చేవు పదరి నీవు
చెంత నిన్ను గేలిసేసి సెలవి నవ్వీనంటా
యింత యాల మొక్కేవు యిందరిలోను

(॥ఎప్పు॥)
అలమేలుమంగ నిన్ను అంటకోకుమనీనంటా
లలి శ్రీవేంకటేశ యెంత భ్రమసేవు
అలమి బలిమిఁబట్టి ఆపె నిన్నుఁ గూడెనంటా
నిలువున నీవేల నివ్వెరగయ్యేవు

(||pallavi||)
ĕppuḍū nābĕ nīsŏmmĕ yĕṁdu voyīni
sĕpparāni valabu nīsedilonĕ kādā

(||ĕppu||)
kannĕnīdom̐ gobagiṁchi kadisi māḍāḍadaṁṭā
yĕnni priyamulu sĕppe nĕṁdām̐kānu
sannaladiṭṭudiṭṭi salamu sādiṁchīnaṁṭā
vanni yānalela pĕṭṭi vaṁkiṁ(giṁ?) sevu

(||ĕppu||)
maṁtanāna nābĕ nīdo māḍalāḍagunnadaṁṭā
saṁtamela ichchevu padari nīvu
sĕṁta ninnu gelisesi sĕlavi navvīnaṁṭā
yiṁta yāla mŏkkevu yiṁdarilonu

(||ĕppu||)
alamelumaṁga ninnu aṁṭagogumanīnaṁṭā
lali śhrīveṁkaḍeśha yĕṁta bhramasevu
alami balimim̐baṭṭi ābĕ ninnum̐ gūḍĕnaṁṭā
niluvuna nīvela nivvĕragayyevu