ఎప్పుడెప్పుడంటా నిచ్చగించీ వాఁడే
(॥పల్లవి॥)
ఎప్పుడెప్పుడంటా నిచ్చగించీ వాఁడే
చిప్పిలు నీ పతిఁ జేకొనవమ్మా
(॥ఎప్పు॥)
పలుకుఁదేనెలు పారఁజల్లి చల్లి
చిలుకుఁజూపులు చిమ్మి చిమ్మి
కులుకునవ్వులఁ గొసరికొసరి
చెలువునిఁ బేరఁ బిలువవమ్మా
(॥ఎప్పు॥)
సారెకు బొమ్మల జంకించి జంకించి
కూరిమి లోలోఁ గొచ్చికొచ్చి
తోరపుఁజెమటలఁ దొప్పఁదోఁగితోఁగి
చేరి నీపతిపయిఁజేయి చాఁచవమ్మా
(॥ఎప్పు॥)
గుబ్బలకొసలఁ గుదించి కుదించి
జొబ్బిలు నీమోవిఁ జూపిచూపి
వొబ్బిలి శ్రీవేంకటోత్తముఁ గూడితి
అబ్బురా లీతని నంటించవమ్మా
(||pallavi||)
ĕppuḍĕppuḍaṁṭā nichchagiṁchī vām̐ḍe
sippilu nī padim̐ jegŏnavammā
(||ĕppu||)
palugum̐denĕlu pāram̐jalli salli
silugum̐jūbulu simmi simmi
kulugunavvulam̐ gŏsarigŏsari
sĕluvunim̐ beram̐ biluvavammā
(||ĕppu||)
sārĕgu bŏmmala jaṁkiṁchi jaṁkiṁchi
kūrimi lolom̐ gŏchchigŏchchi
torabum̐jĕmaḍalam̐ dŏppam̐dom̐gidom̐gi
seri nībadibayim̐jeyi sām̐savammā
(||ĕppu||)
gubbalagŏsalam̐ gudiṁchi kudiṁchi
jŏbbilu nīmovim̐ jūbisūbi
vŏbbili śhrīveṁkaḍottamum̐ gūḍidi
abburā līdani naṁṭiṁchavammā