ఎప్పుడయ్యా ఆ మేలు యెఱిఁగే నేను
(॥పల్లవి॥)
ఎప్పుడయ్యా ఆ మేలు యెఱిఁగే నేను
కొప్పు దువ్వి నిన్నుఁ జేకొనదా యింకా
(॥ఎప్పు॥)
కాలమెల్ల నాపె నీతో కన్నులారుచనే పట్టె
నాలి మాని కొఁతైనా నవ్వదా యింకా
వేలఁ జూపి మగఁడంటా విఱ్టవీఁగనే పట్టె
చేలకొంగు గప్పి బుద్ది చెప్పదా యింకా
(॥ఎప్పు॥)
కొలువు సేయుచు నిన్నుఁ గూరిమి గొసరఁబట్టె
చలివాయ వలవులు చల్లదా యింకా
కలిమి మెఱసి నీకుఁ గానుక లియ్యనే పట్టె
ములువాఁడి కొనగోర మోపదా యింకా
(॥ఎప్పు॥)
చనవు మెరసి నీకు చవులుచూపనె పట్టె
చెనకి రతుల సేవసేయదా యింకా
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
యెనసి మరీ నెలయించదా యింకా
(||pallavi||)
ĕppuḍayyā ā melu yĕṟim̐ge nenu
kŏppu duvvi ninnum̐ jegŏnadā yiṁkā
(||ĕppu||)
kālamĕlla nābĕ nīdo kannulārusane paṭṭĕ
nāli māni kŏm̐tainā navvadā yiṁkā
velam̐ jūbi magam̐ḍaṁṭā viṟṭavīm̐gane paṭṭĕ
selagŏṁgu gappi buddi sĕppadā yiṁkā
(||ĕppu||)
kŏluvu seyusu ninnum̐ gūrimi gŏsaram̐baṭṭĕ
salivāya valavulu salladā yiṁkā
kalimi mĕṟasi nīgum̐ gānuga liyyane paṭṭĕ
muluvām̐ḍi kŏnagora mobadā yiṁkā
(||ĕppu||)
sanavu mĕrasi nīgu savulusūbanĕ paṭṭĕ
sĕnagi radula sevaseyadā yiṁkā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
yĕnasi marī nĕlayiṁchadā yiṁkā